క‌ళాత‌ప‌స్వి అందుకే తెలుగు మ‌హాస‌భ‌ల‌కు వెళ్ల‌లేద‌ట‌

Update: 2017-12-19 07:16 GMT
భారీగా నిర్వ‌హిస్తున్న ప్రపంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌కు మ‌రింత త‌ళుకులు అద్దేలా తార‌ల్ని తీసుకురావాల‌న్న ఆలోచ‌న ఎందుకు వ‌చ్చిందో అంద‌రికి తెలిసిందే. అదెంత ఆఖ‌రి క్ష‌ణంలో వ‌చ్చిందో చెప్పే ఆధారం మ‌రొక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. కావాల‌ని చెప్ప‌కున్నా.. అన్యాప‌దేశంగా చెప్పిన మాట ఇప్పుడు ఆధారంగా మారింది.

క‌ళాత‌ప‌స్వి..  ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడిగా పేరున్న కె.విశ్వ‌నాథ్ తాను ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌కు హాజ‌రు కాలేక‌పోయిన వైనాన్ని వెల్ల‌డించారు. ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వ‌హించిన ఒక అవార్డు ప్ర‌దానోత్స‌వ స‌భ‌కు హాజ‌రైన ఈ దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్ర‌హీత‌.. త‌న‌ను ఆదివారం రాత్రి ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌కు రావాల‌ని.. సోమ‌వారం సాయంత్రం జ‌రిగే స‌భ‌కు హాజ‌రు కావాల‌ని కోరార‌న్నారు.

అయితే.. కొంత కాలం కింద‌టే తానీ అవార్డు కార్య‌క్ర‌మానికి వ‌స్తాన‌ని నిర్వాహ‌కుల‌కు మాట ఇచ్చాన‌ని అందుకే తాను హైద‌రాబాద్‌ లో జ‌రుగుతున్న ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల కార్య‌క్ర‌మానికి హాజ‌రుకాలేద‌న్నారు. ఈ సంద‌ర్భంగా సినిమా అనేది ఎంత ప‌విత్ర‌మైన కార్య‌మ‌న్న మాట‌ను కె.విశ్వ‌నాథ్ చెప్పుకొచ్చారు.

భ‌గ‌వంతుడు త‌న‌నొక ద‌ర్శ‌కుడిని చేసి.. సినిమా వీడియా అనే బ‌స్సులో భ‌క్తుల‌ను జాగ్ర‌త్త‌గా సినిమా అనే పుణ్య క్షేత్రానికి తీసుకెళ్ల‌మ‌ని చెప్పార‌ని.. దానిని తాను పాటించిన‌ట్లు చెప్పారు. ఎన్వీఆర్ ట్ర‌స్టు ఆధ్వ‌రంలో న‌న్న‌ప‌నేని వెంక‌ట్రావు విశిష్ఠ అవార్డును విశ్వ‌నాథ్‌ కు అంద‌జేశారు.
Tags:    

Similar News