రీసెంట్ గా ప్రసాద్ ల్యాబ్స్ లో తెలుగు సినిమాకి సంబంధించిన ఓ అరుదైన ఫంక్షన్ జరిగింది. గృహప్రవేశం అనే చిత్రం రిలీజ్ అయ్యి 70 ఏళ్లు గడిచిన సందర్భంగా ప్రత్యేక వేడుకను ఏర్పాటు చేశారు. ఈ మూవీలో తెలుగు సినిమాకు తొలి తరం హీరోల్లో ఒకరైన ఎల్వీ ప్రసాద్ హీరోగా నటించడం విశేషం.
ఈ అపురూపమైన వేడుకకు.. తెలుగు సినీ ప్రముఖులతో పాటు దిగ్గజాలు కూడా చాలామంది హాజరయ్యారు. దర్శకరత్న దాసరి నారాయణ రావు.. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు.. దిగ్గజ దర్శకుడు కె. విశ్వనాథ్ లు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అయితే.. అనేక మంది ఈ ప్రోగ్రాంకి తమ స్టేటస్ కి తగినట్లుగా డాబు దర్పం చూపిస్తూ హాజరు కాగా.. అంత పెద్ద దర్శకుడైన కె విశ్వనాథ్ మాత్రం.. చాలా సింపుల్ గా శాంట్రో కారులో రావడం ఆశ్చర్యం కలిగించింది. లగ్జరీ కార్లను మెయింటెయిన్ చేయగల స్తోమత ఉన్నా.. అలాంటివాటికి విశ్వనాథ్ చాలా దూరంగా ఉంటారు.
కె. విశ్వనాథ్ ప్రసాద్ ల్యాబ్స్ దగ్గరకు రాగానే.. ఆయనకి ఒక్కసారి షేక్ ఇచ్చేందుకు చాలామంది గెస్టులు లైన్ లో నుంచున్నారు. వీరిలో బీఎండబ్ల్యూలు .. బెంజ్ కార్లు దిగొచ్చిన బాబులు కూడా ఉండడం విశేషం. తెలుగు సినిమా గర్వించేంతటి సినిమాలు తీసిన ఈ దర్శక దిగ్గజం నుంచి.. సింప్లిసిటీ విషయంలో ఈ తరం నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయ్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/