ఆయన సినిమాలకు ఓటీటీలో అంతకంతకు గిరాకీ పెరుగుతోందట. వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తూ ఇక్కడా పాపులరయ్యాడు. ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ రెండు చోట్లా అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇటు అటు మార్కెట్ పరంగా ఆయన సినిమాలకు గిరాకీ పెరుగుతోంది. అందుకే ఇప్పుడు తంబీ ఏం చేసినా అందరి చూపు అటువైపే. ఇంతకీ ఎవరా అరవతంబీ అంటే? ఇంకెవరు.. విజయ్ సేతుపతి. వరుస ప్రయోగాలతో కమల్ హాసన్ తర్వాత అంతటివాడిగా పాపులారిటీ దక్కించుకున్న సేతుపతికి మహర్థశ ఇంకా కొనసాగుతోంది.
తమిళ స్టార్ హీరో కం టాలీవుడ్ విలన్ విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం `కా పే రణసింగం` ఈ రోజు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం జీ ప్లెక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రంలో కథానాయికగా నటించింది.
ఈ చిత్రం మంచి వినోదాత్మక అంశాలతో కుటుంబ భావోద్వేగాలతో రంజింపజేస్తోందన్న టాక్ ఉంది. రైతుల సమస్యలను చక్కగా తెరపై ఆవిష్కరించారన్న టాక్ వచ్చింది. ఈ చిత్రం జీ-ప్లెక్స్ లో పే-పర్-వ్యూ ఫార్మాట్ లో అందుబాటులో ఉంది. `విరుమండి` ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఐదు భారతీయ భాషలలో వీక్షకులకు అందుబాటులో ఉంది. అయితే పే పర్ వ్యూ వల్ల తెలుగు ఆడియెన్ ఈ మూవీని వీక్షిస్తారా? అన్నది చూడాలి.