కబాలి కూడా కన్నీళ్లే మిగిల్చాడు

Update: 2016-08-08 08:06 GMT
లక్ష్మీగణపతి ఫిలిమ్స్.. ఒకప్పుడు బాగా ఫేమస్. డబ్బింగ్ సినిమాలతో పాపులరై పెద్ద రేంజికి వెళ్లింది ఆ సంస్థ. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘విక్రమసింహా’ దెబ్బకు ఆ పేరే తెలుగు రాష్ట్రాల్లో వినిపించకుండా పోయింది. ఆ సంస్థను ఆ స్థాయిలో ముంచేసింది ఆ సినిమా. ఆ తర్వాత ‘లింగా’ దెబ్బకు రోడ్డున పడ్డ బయ్యర్లు చాలా మందే ఉన్నారు. ఐతే ‘కబాలి’ సినిమా ఆ మరకల్ని చెరిపేస్తుందని.. భారీగా లాభాలు తెచ్చిపెడుతుందని ఆశించారు జనాలు. ఆ సినిమా మీద ఉన్న హైప్ చూస్తే అది నిజమే అనిపించింది. అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరగడం.. సినిమాకు టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ కూడా బాగానే రావడంతో ‘కబాలి’ మీద పెట్టుబడి పెట్టిన వాళ్లకు ఢోకా ఉండదని అనుకున్నారు.

కానీ చివరికి చూస్తే ‘కబాలి’ కూడా రజినీ పాత సినిమాల లిస్టులోనే చేరిపోయింది. విక్రమ సింహా.. లింగా సినిమాల స్థాయిలో కాదు కానీ. ‘కబాలి’ కూడా బయ్యర్లకు కన్నీళ్లే మిగిల్చింది. ఈ సినిమా వల్ల బయ్యర్లకు దాదాపు పది కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. రూ.32 కోట్లు పెట్టి ఈ సినిమాను కొన్న నిర్మాతలు.. మూణ్నాలుగు కోట్లు లాభం పెట్టుకుని అమ్ముకున్నారు. ఐతే సినిమా పాతిక కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. తొలి వారాంతంలో రూ.18 కోట్ల షేర్ రావడంతో బయ్యర్లు సంతోషించారు కానీ.. వీకెండ్ తర్వాత కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. రెండో వారం వచ్చేసరికి ‘కబాలి’ అడ్రస్ గల్లంతయిపోయింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘కబాలి’ థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తయింది. మొత్తానికి సూపర్ స్టార్ ను నమ్ముకున్నందుకు మరోసారి మునిగారు బయ్యర్లు.
Tags:    

Similar News