12 గంటల్లో క్లైమాక్స్ కంప్లీట్..

Update: 2016-02-09 07:30 GMT
ఆది - ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా నటించిన గరం మరో నాలుగు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఫిబ్రవరి 12న భారీ ఎత్తున గరంను రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో మోస్ట్ వాంటెడ్ విలన్ గా గుర్తింపు పొందుతున్న కబీర్ దుహాన్ సింగ్ ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. తెలుగులో తనకు ఇది ఐదో సినిమా అంటూ.. మరిన్ని ఇంట్రస్టింగ్ డీటైల్స్ పంచుకున్నాడు కబీర్. గతేడాది మార్చ్ 27న కబీర్ తొలి మూవీ జిల్ విడుదల కాగా.. ఏడాది కూడా పూర్తి కాకముందే టాలీవుడ్ లో తన ఐదో మూవీ రిలీజ్ కావడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నాడు కబీర్. ఏ ఆర్టిస్ట్ అయినా.. ఇది చాలా పెద్ద విషయమే అని చెప్పాలి.

గరం మూవీలో ఈ విలన్ గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తుండగా.. పైకి మాత్రం చాలా క్యూట్ గా, సాఫ్ట్ గా కనిపిస్తాడట. అయితే లోపల మాత్రం అంతకంటే క్రూరమైన విలన్ దాగి ఉంటాడని చెప్పాడు. 'ఈ సినిమాలో సాయికుమార్ తమ్ముడు రవి శంకర్ నా కేరక్టర్ కి డబ్బింగ్ చెప్పాడు. ఇది చాలా బాగా వచ్చింది. విడిగా నేను విన్నా సరే.. థియేటర్లో నా కేరక్టర్ కి వాయిస్ వినేందుకు చాలా ఆతృతగా ఉన్నా' అని చెప్పాడు కబీర్ సింగ్. గరం చిత్రంలో చాలా హైలైట్స్ ఉంటాయని.. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా చిత్రీకరించారని చెబుతున్నాడు ఈ విలన్. హీరో ఆదికి, తనకు మధ్య వచ్చే ఫైట్ తో ఈ మూవీ ఫినిష్ అవుతుందని చెప్పిన కబీర్.. స్టంట్ మాస్టర్ మంజు సూపర్బ్ ఫైటింగ్ సీక్వెన్స్ లు అందించాడన్నాడు.

అంతే కాదు.. కేవలం 12 గంటల్లో మొత్తం క్లైమాక్స్ షూటింగ్ పూర్తయిపోయిందట. ఈ సీన్స్ పిక్చరైజేషన్ సమయంలో.. నేను ఆరు గుర్రపు జీన్లు ధరించి షూటింగ్ లో పాల్గొన్నానంటే.. ఈ సన్నివేశాలు ఎంత టఫ్ గా ఉంటాయో అర్ధం చేసుకోవాలని చెప్పాడు కబీర్ దుహాన్ సింగ్.
Tags:    

Similar News