ఇటీవలి కాలంలో ఎక్కువగా చర్చల్లోకి వచ్చిన బాలీవుడ్ సినిమా ఫాంటమ్. ఆగష్టు 28న ఈ చిత్రం రిలీజవుతోంది. సైఫ్ అలీఖాన్, కత్రిన కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా తదితరులు కీలకపాత్రలు పోషించారు. 26/ 11 ఎటాక్స్ తర్వాత ముంబైలో ఏం జరిగింది? అన్నదే కథాంశం. ఇందులో పాక్ తీవ్రవాద గురువులకు సంబంధించిన ప్రస్థావన ఉందంటూ అప్పట్లో వివాదం చెలరేగింది. దీంతో పాకిస్తాన్ కోర్టు ఈ చిత్రం రిలీజ్ ని అడ్డుకుంది.
ఏదేమైనా ఫాంటమ్ ఆగస్టు 28న అన్నిచోట్లా రిలీజవుతోంది. పాకిస్తాన్ బార్డర్ దాటి సినిమా డీవీడీలు సీక్రెట్ గా వెళ్లిపోవడం ఖాయం. అయితే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న కబీర్ ఖాన్ మాట్లాడుతూ ఓ కీలకమైన విషయాన్ని చెప్పాడు. కత్రినతో ఇప్పటికే రెండు సినిమాలకు పనిచేశా. న్యూయార్క్, ఏక్ థా టైగర్ చిత్రాల్లో కలిసి పనిచేశాం. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కలిసి పనిచేస్తున్నాం. తనతో ఉన్న కంఫర్ట్ లెవల్ వల్లే ఈ సినిమాకి ఎంపిక చేసుకున్నానని కబీర్ చెప్పాడు.
రామ్‌గోపాల్ వర్మ '24/ 11 ముంబై ఎటాక్స్' ఓ సంచలనం. ఆ సినిమాని మించి కబీర్ ఖాన్ సినిమా విజయం సాధించాలని కోరుకుందాం. ఇటీవలే భజరంగి భాయిజాన్ తో ఇండియా టాప్ 2 సినిమాని అందించాడు. 600కోట్లు పైగా వసూలు చేసిందీ చిత్రం. ఇప్పుడు ఫాంటమ్ ఎలాంటి రికార్డును అందుకుంటుందో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.