హిందీ బాక్సాఫీస్ వద్ద సౌత్ రీమేక్ ల హవా సాగుతోంది. ముఖ్యంగా తెలుగు సినిమాల రీమేక్ లు ఘనవిజయాలు సాధిస్తున్నాయి. ఆ కోవలోనే తాజాగా రిలీజైన `కబీర్ సింగ్` సంచలన విజయం సాధించింది. తెలుగు బ్లాక్ బస్టర్ `అర్జున్ రెడ్డి` రీమేక్ గా తెరకెక్కిన `కబీర్ సింగ్`కి తొలుత మిశ్రమ స్పందనలతో జాతీయ మీడియా గుస్సా నడిపించింది. రిలీజ్ ముందే వివాదాలు చుట్టు ముట్టాయి. వివాదాలు ఓవైపు.. వ్యతిరేకతలు ఇంకోవైపు .. సోషల్ మీడియాలో ఈ సినిమాని ఆపాలంటూ చాలానే యుద్ధం జరిగింది. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగానూ వివాదాల్లోకి లాగారు. అయితే అన్నిటినీ తట్టుకుని `కబీర్ సింగ్` ఘనవిజయం సాధించింది. టార్గెట్ చేసిన యూత్ ని పదే పదే థియేటర్లకు రప్పించడంలో సఫలమైంది. ఎట్టకేలకు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫుల్ రన్ లో 275 కోట్లు వసూలు చేస్తోందని రిపోర్ట్ అందింది.
ఇప్పటికే 274 కోట్లు వసూలైంది. ఐదు వారాల పాటు ఎదురే లేకుండా వసూలు చేసిన ఈ చిత్రం ఆరోవారంలో చాలా వరకూ డ్రాప్ అయ్యింది. ఆరో వారంలో 2.25 కోట్లు వసూలు చేయగలిగింది. దాదాపు 70 శాతం మేర వసూళ్లు డ్రాప్ అయ్యాయని ట్రేడ్ చెబుతోంది. అయితే ఇప్పటికే కబీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులెన్నిటినో తిరగరాసింది. షాహిద్ కెరీర్ లో సోలో 100కోట్ల క్లబ్ సినిమాగా అవతరించింది. ఇంతకుముందు `యూరి` సాధించిన రికార్డుల్ని `కబీర్ సింగ్` బ్రేక్ చేసింది. ఈ సినిమా తర్వాత ఈ విజయంతో బాలీవుడ్ లో మునుముందు తెలుగు సినిమా కథలదే మరింత హవా పెరగనుందని అర్థమవుతోంది. ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న టైమ్ లోనే పలువురు బాలీవుడ్ హీరోలు తెలుగులో హిట్టయిన సినిమాల రీమేక్ హక్కుల్ని ఛేజిక్కించుకోవడం చూస్తుంటే ఆ మేరకు మనకు గుడ్ టైమ్ రన్ అవుతోందనే చెప్పాలి. కిలాడీ అక్షయ్ కుమార్ ఇప్పటికే రెండు సౌత్ బ్లాక్ బస్టర్ల రీమేక్ లలో నటిస్తూ వేడి పెంచాడు. సల్మాన్, అజయ్ దేవగన్ లాంటి హీరోలు సౌత్ సినిమాల్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. కరణ్ జోహార్ ఇప్పటికే విజయ్ దేవరకొండ `డియర్ కామ్రేడ్` చిత్రాన్ని రీమేక్ చేస్తున్నామని ప్రకటించారు. ఇదంతా రీమేక్ సినిమా `కబీర్ సింగ్` సక్సెస్ ఇచ్చిన కిక్కు అనే చెప్పాలి.