తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగ్గ నటుడు కైకాల సత్యనారాయణ. ఆ మాటకొస్తే భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే ఆయన లాంటి నటులు అరుదుగా ఉంటారు. కానీ అలాంటి గొప్ప నటుడికి పద్మ పురస్కారమేదీ దక్కలేదు. కనీసం పద్మశ్రీ కూడా ఇవ్వలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయమై కైకాలను అడిగితే.. తనకు బ్యాగ్రౌండ్ లేకపోవడం వల్లే అవార్డు రాలేదన్నారు. పదేళ్ల కిందట తనను కాంగ్రెస్ ప్రభుత్వం పద్మశ్రీ కోసం ప్రతిపాదించినా.. కేంద్రంలో ఓ మంత్రి కారణంగా తనకు అవార్డు రాలేదని చెప్పారు. ఆ మంత్రి ఎవరో.. కైకాలకు అవార్డు ఎందుకు రాలేదో.. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘ఒక మీటింగ్ లో ఒక పెద్దాయన నా గురించి మాట్లాడుతూ వచ్చి.. ఈయనకు పద్మశ్రీ కాదు పద్మభూషణ్ ఇవ్వాలి. ఇంతవరకు ఆయనకు అవార్డు రాకపోవడానికి మనం సిగ్గుపడాలి. ప్రభుత్వం సిగ్గుపడాలి.. అన్నారు. ఈ అవార్డులు వాటంతట అవి రావు.. వెళ్లి తెచ్చుకోవాలి. అంటే రికమండ్ చేసి తెచ్చుకోవాలన్నమాట. అలా అయితే ఇస్తారు అవార్డులు. అలా ఉంది ఇవ్వాళ రేపు పరిస్థితి. నన్ను పది సంవత్సరాల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం నా బయోడేటా.. ఫొటోలు తీసుకుని పద్మశ్రీకి పంపించింది. అప్పుడు మన రమణాచారి గారు ఎఫ్.డి.సి. కమిషనర్. శివరాజ్ పాటిల్ గారు హోం మినిస్టర్. పాటిల్ నా వ్యవహారం అంతా చూసి ఈయన ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా నెగ్గారు. హానర్ ప్రిన్సిపల్ ఇవ్వడానికి వీల్లేదన్నాడు. కళకి.. రాజకీయాలకు సంబంధం ఏంటి అన్నప్పటికీ ఇవ్వడానికి వీల్లేదు అన్నారు. అలా ఎగ్గొట్టారు.
సంజయ్ బారు అని మన్మోహన్ సింగ్ గారి పీఏ.. నాకు ఉత్తరం రాశాడు పాపం. ‘నేను మీ అభిమానినండీ.. మీరంటే నాకు మహా ఇంట్రెస్ట్. మీకు ఇక్కడ అన్యాయం జరుగుతోందండీ.. తర్వాతి ఏడాది మీకు అవార్డు ఎలా రాదో చూస్తాను’ అంటూ ఆయన వెళ్లి ట్రై చేశారు. కానీ ఆయనకూ అదే సమాధానం వచ్చింది. మన చిరంజీవికి అవార్డు ఎలా వచ్చింది? మోహన్ బాబుకు ఎలా వచ్చింది? బ్రహ్మానందానికి.. వీళ్లందరికీ ఎలా వచ్చాయి? వెనకాల బ్యాగ్రౌండ్ ఉంది. మనకి అది లేదు. ఆ ప్రొడ్యూసర్లో.. స్నేహితులో.. ఆ సెంట్రల్ వాళ్లో.. ఏదో ఒక సాయం ఉంది వాళ్లకి. నాకా హెల్ప్ లేదు. నేనొక్కటే అనుకున్నాను.. మీకన్నింటికంటే హైయెస్ట్ అవార్డ్ ప్రజల హృదయాల్లో చెరగని స్థానం. అంతకు మించిన అవార్డ్ ఏముంటుంది? అవార్డులుంటే గూట్లో అలంకారంగా పెట్టుకుంటాం. పద్మశ్రీ వచ్చిందా.. నాలుగు రోజుల తర్వాత మరిచిపోతాం’’ అని కైకాల పేర్కొన్నారు.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/