నవరస నటనా సార్వభౌముడు, సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టిన రోజు నేడు (జూలై 25). ఈ సందర్భంగా కైకాల ఇంట్లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా కుటుంబ సభ్యుల సమక్షంలో కైకాల సత్యనారాయణతో కేక్ కట్ చేయించిన చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సీనియర్ నటుడిని ఆప్యాయంగా పలకరించారు. కొంత కాలంగా వయోభారం కారణంగా అనారోగ్యానికి గురైన కైకాల సత్యనారాయణ ఇంటిలోనే చికిత్స పొందుతున్నారు.
అయితే ఇది గమనించిన చిరంజీవి ప్రత్యేకంగా కైకాల సత్యనారాయణ ఇంటికి వెళ్లి ఆయనని పరామర్శించడమే కాకుండా పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేసి కేక్ కట్ చేయించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
అంతే కాకుండా `పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టినరోజున,వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది. ఆ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటుంటున్నాను` అంటూ ట్విట్ చేశారు.
చిరు తన ఇంటికి రావడం పై కైకాల సత్యనారాయణ సోదరుడు, నిర్మాత కైకాల నాగేశ్వరరావు స్పందించారు. అన్నయ్య పుట్టిన రోజున చిరంజీవి మా ఇంటికి రావడమే కాకుండా అన్నయ్యతో చాలా సమయం గడిపారు. ఆయనకు ధైర్యాన్నిచ్చారు.
అన్నయ్యతో పాటు మాలోనూ కొండంత ధైర్యాన్ని నింపారు` అని తెలిపారు. కైకాల సత్యనారాయణ రమా ఫిలింస్ బ్యానర్ పై ఎన్నో చిత్రాలని నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవితో ఆయన నిర్మించిన `కొదమసింహం` కౌబాయ్ సినిమాల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలచింది.
చిరంజీవి - కైకాల కాంబి నేషన్ లో పులి - బెబ్బులి, సంఘర్షణ, మంత్రిగారి వియ్యంకుడు, గూండా, ఇంటిగుట్టు, రుస్తుం, నాగు, చట్టంతో పోరాటం, చిరంజీవి, జ్వాల, పులి, రక్త సింధూరం, విజేత, కొండవీటి దొంగ, మగధీరుడు, చాణక్య శపథం, చక్రవర్తి, జేబు దొంగ, మంచి దొంగ, మయుడికి మొగుడు, ఖైదీ నంబర్ 786, రుద్రవీణ వంటి తదతర చిత్రాలొచ్చాయి.