టాలీవుడ్ మరో అద్భుత నటుడిని కోల్పోయింది. సంవత్సరం ముగింపులో ఇది పరిశ్రమకు విషాదాంతం! నవరసనటనాసార్వభౌమ కైకాల సత్యనారాయణ(87) ఇక లేరు! నేటి (23డిసెంబర్ 2022) తెల్లవారుజామున 4 గంటలకు వెటరన్ నటుడు ఇహలోకాన్ని వీడారు. నిజానికి ప్రముఖ తెలుగు నటుడు కైకాల సత్యనారాయణ పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరారని ఈ ఏడాది నవంబర్ 20న వార్తలు వచ్చాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు కథనాలొచ్చాయి.
కైకాల ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కుటుంబ సభ్యులు నవంబర్ 20న హైదరాబాద్- జూబ్లీహిల్స్ లోని ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారని వార్తా కథనాలు వెలువడ్డాయి. అప్పటికే ఆయనను వెంటిలేటర్ పై ఉంచారు. సత్యనారాయణకు 86 ఏళ్లు. కొద్దిరోజుల పాటు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స అందించారు. గత కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం.
అక్టోబరులో కైకాల సత్యనారాయణ నగరంలోని తన ఇంటి వద్ద జారిపడిపోవడంతో ఆస్పత్రిలో చేర్చారని కూడా తెలిసింది. అతనికి చికిత్స అందించిన వైద్యులు ప్రాణాలను నిలపగలగారు. అటుపై ఆయన మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నవంబర్ 20న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఉన్నపుడే మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆస్పత్రిని సందర్శించి ఉత్తమ చికిత్సను అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
దాదాపు ఆరు దశాబ్దాల పాటు అజేయంగా సాగిన తన కెరీర్ లో కైకాల సత్యనారాయణ 800కు పైగా పాత్రల్లో నటించారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి అనేక చిత్రాల్లో కైకాల నటించారు. సినిమాల్లో నటించడమే కాకుండా పలు చిత్రాలను నిర్మించారు. కైకాల సత్యనారాయణ రాజకీయాల్లోనూ చురుగ్గా ఉండేవారు. 11వ లోక్ సభ ఎన్నికల్లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
1959లో చెంగయ్య దర్శకత్వం వహించిన `సిపాయి కూతురు` చిత్రంతో ఆయన సినీరంగప్రవేశం చేశారు. మొదట్లో సినిమాల్లో విలన్ పాత్రలు చేసారు. అయితే ఏళ్లు గడిచేకొద్దీ కైకాల సత్యనారాయణ క్యారెక్టర్ రోల్స్ చేసి ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. కురుక్షేత్రం- గోల నాగమ్మ- నర్తనశాల- లవ కుశ సహా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో అద్భుత నటనతో అలరించారు. ఆయన కెరీర్ లో అందుకోని అవార్డులు రివార్డులు లేవు. మెగా స్టార్ కి మెగా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన కైకాల మరణాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోందని సమాచారం. సీనియర్ హీరోలు బాలకృష్ణ- వెంకటేష్- నాగార్జున- మోహన్ బాబు వంటి వారికి కైకాల అత్యంత ఆప్తుడు. యావత్ టాలీవుడ్ ఈ వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.