150లో కాజల్.. అంతడిగే సీనుందా!?

Update: 2016-07-21 07:35 GMT
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కి  ఈ మధ్య అస్సలు టైమ్ బాగాలేదు. అటు బాలీవుడ్ తో పాటు.. ఇటు టాలీవుడ్ లోను సినిమాలు డింకీ కొట్టేశాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ కానీ.. సూపర్ స్టార్ మహేష్ తో చేసిన బ్రహ్మోత్సవం కానీ ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు. దీంతో కొత్త ఆఫర్స్ ను ఈమెకు ఇవ్వడంలో మేకర్స్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఈ అమ్మడి దగ్గరకు చేరిందనే వార్తలొస్తున్నాయి.

చిరు సినిమాలో నటించేందుకు ఈమె అడిగిన రెమ్యూనరేషన్ విని.. రామ్ చరణ్ కూడా షాక్ అయ్యాడని అంటున్నారు. చెర్రీ-కాజల్ ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పటికే 4 సినిమాల్లో కలిసి నటించారు కూడా. ఇప్పుడు తండ్రి సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్.. చిరు పక్కన హీరోయిన్ ఆఫర్ ని.. తనే స్వయంగా కాజల్ కి చెప్పాడట. కెరీర్ చివరి దశలో ఉందని అనుకుంటున్న టైమ్ లో వచ్చిన ఈ ఆఫర్ కి.. ఎగిరి గంతేస్తుందని అంతా అనుకోవచ్చు. కానీ కాజల్ మాత్రం రెండున్నర కోట్ల రెమ్యూనరేషన్ అడిగిందని అంటున్నారు. వరుసగా అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్స్ కొడుతూ సౌత్ లోనే టాప్ రేంజ్ లో ఉన్న నయనతార రెమ్యూనరేషన్ తో సమానం ఇది. ఏ యాంగిల్ లో చూసినా.. కాజల్ కి ఇంత ఇచ్చి హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ లేదని అంటున్నారు.

మరి చందమామ నిజంగా ఇంత అడిగిందో.. లేక ఇది కూడా పుకారేనా అన్న విషయం తేలాల్సి ఉంది. అయితే ఒకవేళ చిరంజీవి పక్కన చేయడం ఇష్టం లేక ఇంత ఎక్కువగా కోట్ చేసిందా?? ఒకవేళ చిరు వంటి ఏజ్డ్ స్టార్ తో చేస్తే.. రానాతో చేస్తున్న సినిమా రిలీజ్ అయినా కూడా కుర్ర హీరోలు పిలువరు అనుకుందేమో. అయినా చేతిలో ఒక్క పెద్ద హీరో సినిమా కూడా లేని కాజల్ కు ఆఫర్‌ రావడమే చాలా పెద్ద విషయం. ఇక చేస్తుందో లేదో ఆమె ఇష్టం.

Tags:    

Similar News