వరుణ్ తేజ్ - శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఒక మూవీ ఓకే అయిన విషయం తెలిసిందే. బ్రూస్ లీ డిజాస్టర్ తర్వాత డైలమాలో పడిపోయిన వైట్లకి.. మరో ఆఫర్ ఇచ్చిన మెగా క్యాంప్, ఈ సినిమాని సక్సెస్ చేయగలిగితే అల్లు అర్జున్ తో కూడా ఓ సినిమా చేసేందుకు మెగా టీం ఓకే చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. అందుకే వరుణ్ తేజ్ సినిమా విషయంలో చాలా ఎక్కువగా కేర్ తీసుకుంటున్నాడు శ్రీను వైట్ల.
ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోందని గతంలో వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడీ మూవీలో హీరోయిన్ రకుల్ కాదని తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ - వరుణ్ తేజ్ లతో టెస్ట్ ఫోటో షూట్ జరుగుతోంది. కాజల్ ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉండడంతో పాటు పవన్ కళ్యాణ్ - మహేష్ బాబులతో నటిస్తుండడంతో.. చందమామ క్రేజ్ ఒక్కసారిగా టాప్ రేంజ్ కి వెళ్లిపోయింది. దీంతో రకుల్ కంటే కాజల్ బెస్ట్ అని వైట్ల డిసైడ్ అయ్యాడట.
మరోవైపు వైట్ల సినిమాలో హీరోయిన్ కేరక్టర్ పెర్ఫామెన్స్ కి ఎక్కువ స్కోప్ ఉన్న రోల్ కావడంతో.. కాజల్ నే కరెక్ట్ ఆప్షన్ గా భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ అయితే.. మూవీకి హైప్ కూడా జనరేట్ అవుతుందనే ఈ ఛేంజ్ అంటున్నారు.