ఇప్పుడు అందరి కళ్లూ కాజల్ వైపే. ఈ సమ్మర్ సీజన్ లో ఆమె మూడు సినిమాలపై మనస్సు పాడేసుకుంది. ఆ మూడింటిలో ఏ ఒక్కటి క్లిక్ అయినా కూడా అమ్మడి ఫేట్ ఎక్కడో ఉంటుందో. ఇప్పటికే 30 ఏజ్ ను టచ్ అయ్యి.. 10 ఏళ్ళ కెరియర్ ను పూర్తి చేసుకున్న కాజల్ కు ఈ సక్సెస్ లు చాలా కీలకం.
నిన్న చెన్నయ్ లో ఒక పెద్ద బ్రాండ్ షో రూమ్ ను ప్రారంభించడానికి వచ్చిన కాజల్ ను.. ఇదే విషయమై తమిళ రిపోర్టర్లు ప్రశ్నించారు. 'మీరు సర్దార్ గబ్బర్ సింగ్ అండ్ బ్రహ్మోత్సవం పై చాలా అంచనాలు వేసుకుని ఉంటారు. అవి రెండూ ఫ్లాప్ అయ్యాయ్? ఏమనిపిస్తోంది' అని అడిగితే.. ''నేను ఫెయిల్యూర్ ను హృదయం వరకు.. సక్సెస్ ను తల వరకు అస్సలు తీసుకోను. మనం చేసేది మనం చేసుకుపోవడమే. ఇక హిట్ ఆర్ ఫ్లాప్ అనేది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండు సినిమాల్లోనూ నేను మాంచి పాత్రలోనే నటించాను. నా వరకు నా పాత్రలకు మాంచి పేరే వచ్చింది. అంతకంటే ఇంకేం కావాలి. ఫ్లాప్ అనేది నేను పట్టించుకోను'' అని చెప్పుకొచ్చింది కాజల్.
అయితే ఈ రెండు తెలుగు సినిమాలూ పూర్తయిపోయాక.. హిందీలో జూన్ 10న దో లఫ్జోం కి కహానీ అని అమ్మడి బాలీవుడ్ ఫిలిం రిలీజవుతోంది. మరి ఈ సినిమా రిజల్టు ఎలా ఉండబోతోందో చూడాలి.