కాజల్‌ ఎంత మాటనేసింది

Update: 2015-06-25 22:30 GMT
సినిమా వాళ్లంటేనే హిపోక్రసీ ఎక్కువ. చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదు. ప్యాషన్‌తోనే సినిమాల్లోకి వచ్చాం.. డబ్బుల కోసం కాదు.. అని చాలా కబుర్లు చెబుతుంటారు కానీ.. వాస్తవాల్ని ఒప్పుకునేవాళ్లు చాలా తక్కువమంది. ఐతే కాజల్‌ మాత్రం మిగతా వాళ్లకు భిన్నంగా మాట్లాడుతోంది. నటన అంటే ప్రాణం, సినిమాలంటే ప్యాషన్‌ అంటూ రొటీన్‌ డైలాగులు చెప్పకుండా.. డబ్బుల కోసమే సినిమా చేస్తున్నా, మరో మాట లేదు అంటూ ఓ ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టింది కాజల్‌.

''డబ్బుల కోసం సినిమాలు చేయట్లేదు అంటే అది అబద్ధమే అవుతుంది. నాకు మాత్రం డబ్బే ముఖ్యం. దాని కోసమే సినిమాలు చేస్తున్నా. సినిమాల్లో నటించడం ఇష్టమే కానీ.. ఆ ఇష్టం కోసమే సినిమాల్లోకి రాలేదు. డబ్బు సంపాదిద్దామనే వచ్చా. అందుకే ఇక్కడున్నా'' అంటూ క్రిస్టల్‌ క్లియర్‌గా చెప్పింది చందమామ. దీన్ని బట్టే పారితోషకం విషయంలో కాజల్‌ చాలా బెట్టు చేస్తుందన్నది రూమర్‌ ఏమీ కాదని అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్‌గా తనకింకా మంచి డిమాండే ఉందని.. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాల విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నానని.. ఇలా బిజీగా ఉన్నంత కాలం పెళ్లి గురించి ఆలోచించే ప్రసక్తే లేదని చెప్పింది కాజల్‌. తెలుగు సినిమాల నుంచి విరామం తీసుకున్న కాజల్‌.. తమిళంలో ధనుష్‌, విశాల్‌ లాంటి స్టార్‌ హీరోల సరసన క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది.


Tags:    

Similar News