బాలీవుడ్ సినిమాల్లో టాప్ హీరోయిన్లు కూడా ఐటమ్ సాంగ్ చేసేందుకు వెనకాడరు. ఆ కల్చర్ మన దగ్గర కూడా వచ్చిందని అనుకున్నాం. కానీ, ఎందుకో మరి, మన హీరోయిన్లు ఐటమ్ సాంగ్ చేసేందుకు భయపడుతూ ఉంటారు! ఒక ఐటమ్ సాంగ్ లో డాన్స్ చేస్తే చాలు, కెరీర్ అయిపోయిందనుకుంటారే! ప్రస్తుతం అలాంటి భయంలోనే బతుకుతోంది కాజల్! జనతా గ్యారేజ్ చిత్రంలో పక్కా లోకల్ అంటూ మాంచి ఊపున్న ఐటమ్ సాంగ్ లో కాజల్ కనిపించింది. తారక్ పక్కన స్టెప్పులేసి అభిమానులను బాగానే ఆకట్టుకుంది. నిజానికి - మొదట్లో ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ వద్దనుకున్నారట. కానీ నిర్మాత పట్టబడ్డటంతో పెట్టాల్సి వచ్చింది. సినిమాకు ఆ పాట ప్లస్ కావాలన్న ఉద్దేశంతోనే కాజల్ ను రంగంలోకి దించారు. దీంతో సాంగ్ అదిరిపోయింది. ఎవరైనా హిట్టొస్తే ఆనందిస్తారు. కానీ, కాజల్ కి ఇదో కొత్త టెన్షన్ అయిపోయిందట!
ఈ పాట తరువాత కాజల్ కు ఆ తరహా ఆఫర్లే వస్తున్నాయట! దీంతో ఎక్కడ ఐటమ్ గర్ల్ గా మిగిలిపోతానేమో అని కాజల్ తెగ భయపడుతోందట. తమిళ పరిశ్రమ నుంచి కాజల్‌కు ఇలాంటి ఆఫర్లు కొన్ని వచ్చాయని తెలుస్తోంది. వాటిని సున్నితంగా తిరస్కరించిందని సమాచారం. కోటి రూపాయలు ఇచ్చినా సరే ఐటమ్ సాంగ్స్ ఇకపై చేసేది లేదని తెగేసి చెప్పింది. జనతా గ్యారేజ్ లో తారక్ హీరో కాబట్టి చేశానని అంటోంది.
ఇప్పటికే హీరోయిన్ గా కెరీర్ సోసోగా ఉంది. ఈ మధ్యనే మెగాస్టార్ 150వ చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సో... ఆ చిత్రం తరువాత మరోసారి హీరోయిన్ గా బిజీ అయ్యే అవకాశాలున్నాయని కాజల్ ఆశిస్తోంది. ఇలాంటి తరుణంలో వస్తున్నాయి కదా అని ఐటమ్ సాంగులు చేసుకుంటూ పోతే...ఐటమ్ గర్ల్ గానే మిగిలిపోయే ప్రమాదం ఉందనీ - ఆ ఆఫర్లకి అడ్డుకట్ట వేసింది కాజల్. తన జీవితంలో ఇంకెప్పుడూ ఐటమ్ సాంగ్స్ జోలికి వెళ్లనని నిర్ణయించుకుందట! ఐటమ్ సాంగ్స్... మరీ అంత ఇదిగా ఉన్నాయా..?