తెలుగులో పుష్కర కాలం నుంచి కథానాయికగా కొనసాగుతోంది కాజల్ అగర్వాల్. మామూలుగా ఇంత కాలం కథానాయికగా కొనసాగాక అవకాశాలు తగ్గిపోవడం.. క్రేజ్ పోవడం.. క్రేజీ ప్రాజెక్టులకు దూరం కావడం మామూలే. కానీ కాజల్ మాత్రం ఇప్పటికీ మంచి క్రేజ్ తోనే కొనసాగుతోంది. గత ఏడాది ‘ఖైదీ నంబర్ 150’ లాంటి బ్లాక్ బస్టర్లో.. ‘నేనే రాజు నేనే మంత్రి’ లాంటి హిట్ మూవీలో నటించిందామె. ప్రస్తుతం ‘ఎమ్మెల్యే’తో పాటు ‘క్వీన్’ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’లోనూ నటిస్తోందామె. కాజల్ ఇప్పటికీ మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తూ.. గ్లామర్ తో జనాల్ని బాగానే ఆకర్షిస్తూ వచ్చింది.
గత ఏడాది కాజల్ నటించిన రెండు సినిమాల్లోనూ అందంగా కనిపించింది. ఐతే ఈ మధ్య కాజల్ గ్లామర్ కొంచెం తేడా కొట్టేస్తున్నట్లే అనిపిస్తోంది. ఫిజిక్ కాపాడుకునేందుకు మరీ ఎక్సర్ సైజులు ఎక్కువ చేసేస్తోందో ఏమో.. బాగా సన్నబడిపోయి ఒంట్లో.. ముఖంలో గ్లో పోయినట్లు కనిపిస్తోంది. చక్కనమ్మ చిక్కినా అందమే కానీ.. మరీ ఈ స్థాయిలో చిక్కితే కష్టమే. ఈ మధ్య రకుల్ ప్రీత్ సింగ్ అలా చిక్కిపోయే కళావిహీనంగా తయారైంది. కాజల్ కూడా అదే బాటలో నడవడం ఆశ్చర్యమే. ఇలా తయారైతే బాలీవుడ్ వాళ్లకు ఓకే కానీ.. సౌత్ జనాలు తట్టుకోలేరు. కెరీర్ ఇంకా కొనసాగాలంటే మాత్రం కాజల్ మళ్లీ కొంచెం ఒళ్లు చేస్తే బాగుంటుంది.