మళ్ళీ వస్తానంటున్న కాజల్

Update: 2022-06-07 09:33 GMT
టాలీవుడ్ చందమామలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ కెరీర్ మొత్తంలో కూడా సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా చాలా బిజీ గా కనిపించింది అనే చెప్పాలి. కేవలం తెలుగులోనే కాకుండా అటు తమిళంలో కూడా ఈ బ్యూటీ అగ్రహీరోయిన్ గా కొనసాగింది. ఒకానొక సమయంలో టాప్ రేంజ్ లో మంచి పారితోషికం కూడా అందుకుంది. లక్ష్మీకళ్యాణం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ మొన్న ఆచార్య సినిమా వరకు  చాలా బిజీగానే కనిపించింది.

అయితే ఆచార్య సినిమాలో ఆమె చేసిన పాత్రను చివరికి తీసి వేయడంతో ఓ వర్గం వారిని నిరాశకు గురిచేసింది. కాజల్ ను మళ్లీ వెండితెరపై చూస్తాము అని అనుకున్న ఆమె అభిమానులు అప్సెట్ అయ్యారు. అయితే మళ్ళీ చాలా కాలం తరువాత కాజల్ అగర్వాల్ సరికొత్తగా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ కొన్ని సినిమాల్లో చేసి ప్రెగ్నెన్సీ రాగానే ఒక్కసారిగా నటనకు దూరం అయింది.

ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీన కాజల్ అగర్వాల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఫ్యామిలీ లైఫ్ తో బిజీ గా మారిపోతున్న కాజల్ ఇక మళ్లీ సినిమాల్లో నటించదు అని వార్తలు అయితే చాలానే వచ్చాయి.

అయితే గతంలో మాత్రం కాజల్ పెళ్లి అయిపోయింది కదా అని... సినిమాలకు దూరం అయిపోను అని ఒక క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుత కాలంలో చాలా మంది సెకండ్ ఇన్నింగ్స్ లో విభిన్నమైన పాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే కాజల్ వయసు ఇంకా  35లోకి రాలేదు కాబట్టి ఇంకా ఆమె హీరోయిన్ గా చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే డిఫరెంట్ గా క్యారెక్టర్స్ లో కూడా హీరోలతో సమానంగా చేసే స్పేస్ కూడా ఉంటుంది. కాబట్టి మళ్లీ సరికొత్తగా రీ ఎంట్రీ ఇవ్వాలని కాజల్ ప్రయత్నాలు చేస్తుందట.

ఆమెకు సంబంధించిన మేనేజర్స్ కూడా ఇప్పటికే ఇండస్ట్రీలోని కొంత మంది ప్రముఖ దర్శక నిర్మాతలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాజల్ కు సరిపోయే పాత్ర ఉంటే మాత్రం వెంటనే వాటిని ఓకే చేసే విధంగా కూడా చర్చలు జరుపుతున్నారు. మరి రీ ఎంట్రీ తో కాజల్ ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News