నా జీవితంలో ఏ మాగాడు లేడు- కాజల్

Update: 2018-02-26 00:49 GMT
అ! అనిపించే అందంతో పాటు అభినయంతో కూడా ఆకట్టుకునే క్యుట్ బ్యూటీ కాజల్ చేతి నిండా సినిమాలు లేవు కాని అవకాశాలకు మాత్రం లోటు లేదు. గత ఏడాది చేసిన ఖైది నెంబర్ 150 - నేనే రాజు నేనే మంత్రి రెండు హిట్ అయినా అవి హీరోల ఖాతాలోకే వెళ్ళిపోవడం కొంత నిరాశ కలిగించినప్పటికి తన పెర్ఫార్మన్స్ కు మాత్రం మంచి మార్కులే దక్కించుకుంది. పరిశ్రమకు వచ్చి దశాబ్దం దాటినా ఇంకా క్రేజ్ మైంటైన్ చేస్తున్న కాజల్ కథల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటోంది. గత కొంత కాలంగా తన మీద వస్తున్న రూమర్స్ పట్ల కాజల్ ఎట్టకేలకు స్పందించింది. ముంబైకు చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తతో ఎఫైర్ ఉందనే వార్త ఆ మధ్య బాలీవుడ్ మీడియాలో బాగా ప్రచారంలోకి వచ్చింది. అక్కడ చెప్పుకోదగ్గ సినిమాలే చేసిన కాజల్ మంచి విజయాలు కూడా దక్కించుకుంది. కాని ఆ పుకారుని కాజల్ పూర్తిగా ఖండించేసింది.

మరోవైపు ఒక  టాలీవుడ్ యూత్ హీరోతో కూడా తను సన్నిహితంగా ఉంటోంది అన్న వార్తలు కూడా కాజల్ కొట్టిపారేసింది. ఇవన్ని శుద్ధ అబద్దాలని - ఏదో ఒకటి కావాలని ప్రచారం చేయటం తప్ప ఇందులో ఎటువంటి నిజం లేదని చెప్పేస్తోంది. తన జీవితంలో ఇప్పటిదాకా ఎటువంటి మగాడు రాలేదని - ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే తప్పకుండా షేర్ చేసుకుంటానని చెప్పింది. పర్సనల్ లైఫ్ బాగా బోర్ గా ఉందని ఒప్పుకున్న కాజల్ తన దృష్టి ఇంకా మంచి సినిమాలు చేయటం మీదే ఉందట. అ! లో కొత్త తరహా పాత్రతో మెప్పించిన కాజల్ కళ్యాణ్ రామ్ ఎమెల్యేతో పాటు తమిళ్ లో క్వీన్ రీమేక్ పారిస్ పారిస్ లో టైటిల్ రోల్ చేస్తోంది. ఇదే సినిమా తెలుగు వెర్షన్ లో తమన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవి కాకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమాలో కూడా తనే హీరొయిన్. పుకార్లకు చెక్ పెట్టిన కాజల్ మరి పెళ్లి ఎప్పుడు అని అడిగితే మాత్రం తొందరెందుకు అని మాట దాటేస్తోంది.



Tags:    

Similar News