కాజ‌ల్ టీమ్ పెద్ద‌దేనండోయ్‌

Update: 2016-11-15 05:38 GMT
విదేశాల్లో షూటింగ్ అంటే ఇదివ‌ర‌కు ప‌రిమితంగానే వెళ్లేవాళ్లు. రానుపోను ప్ర‌యాణానికీ - విడిదికీ ఎక్కువ‌గా ఖ‌ర్చ‌వుతుంద‌ని నిర్మాత‌లు త‌క్కువ‌మందినే తీసుకెళ్లేవాళ్లు. హీరోయిన్ వెంట  ఒక‌రిద్ద‌రు అద‌నంగా ఉండేవాళ్లంతే.  కానీ ఇప్పుడు వ‌ర‌స మారింది. తెర‌పై క‌నిపించేది హీరోయిన్ ఒక్క‌టే కానీ... ఆమె అందంగా క‌నిపించేందుకు స‌హ‌కారం అందించేవాళ్లు చాలామందే. స్టైలిస్ట్‌ ల‌నీ - మేక‌ప్ మెన్‌ ల‌నీ - ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌ ల‌నీ... ఇలా ఒక పెద్ద గ్రూప్ ఉంటుంది.  వాళ్లంద‌రినీ ఇప్పుడు హీరోయిన్లు ఎక్క‌డికెళితే అక్క‌డికి  వెంటే  తీసుకెళుతున్నారు.

వాళ్లతోపాటు తోడుగా ప‌క్క‌న మ‌మ్మీనో - డాడీనో ఎవ‌రో ఒక‌రు ఉండి తీరాల్సిందే. ఆ లెక్క‌న నిర్మాత జేబుకి ఏ రేంజులో చిల్లు ప‌డుతుందో ఊహించుకోవ‌చ్చు. కానీ నిర్మాత‌లు `ట్రెండ్ అలా ఉంది - ఏం చేస్తాం - త‌ప్ప‌దు` అంటూ మారు మాట్లాడ‌టం లేదు. హీరోయిన్ ఎంత చెబితే అంత అన్న‌ట్టు  న‌డుచుకొంటున్నారు.  తెలుగులో వ‌న్ ఆఫ్ ది టాప్ హీరోయిన్‌ గా గుర్తింపు తెచ్చుకొన్న కాజ‌ల్ టీమ్ కూడా కాస్త పెద్ద‌దిగానే క‌నిపిస్తోంది. ప్ర‌తి సినిమాకీ వాళ్లంద‌రినీ విదేశాల‌కి తీసుకెళుతుందో లేదో తెలియ‌దు కానీ... క్రొయేషియాలో జ‌రుగుతున్న  ఖైదీ నెంబ‌ర్ 150 షూటింగ్‌ కి  మాత్రం అంద‌రినీ తీసుకెళ్లింది. త‌న‌తో పాటు చెల్లెలు నిషా అగ‌ర్వాల్ కూడా ఉంది. కాజ‌ల్‌ కి నిషా ఓ స్టైలిస్ట్‌ గా స‌హ‌కారం అందిస్తుంటుంది. సో... ఆ జాబితాలోనే త‌న చెల్లెల్ని విదేశాల‌కి తీసుకెళ్లిన‌ట్టుంది. క్రొయేషియాలో జ‌రుగుతున్న షూటింగ్ స్పాట్‌ లో  త‌న టీమ్‌ తో క‌లిసి ఎంజాయ్ చేసింది కాజ‌ల్‌. అందుకు సంబంధించిన ఫొటోల్ని ట్విట్ట‌ర్‌ లోనూ పోస్ట్ చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News