పెళ్లి తర్వాతా కెరీర్ పరంగా బిజీ అయిపోయిన కాజల్ అగర్వాల్ భర్త కిచ్లుపై అలకబూనారట. తనతో విలువైన సమయం గడపడం లేదని కలత చెందారట. అయితే భార్య భర్తల మధ్య అలాంటి అలకలు కలతలు కామన్ గా ఉండేవే కానీ.. ఆ ఇద్దరి కలతలు తీరేదెలా? అభిమానులు ముచ్చటించుకుంటున్నారు.
లైఫ్ లో ప్రతి సందర్భాన్ని కాజల్ ఎంతో పాజిటివ్ గా చూస్తారు. అందుకే ఎప్పుడూ ఆ అందమైన ముఖంపై చిరునవ్వు కనిపిస్తూ ఉంటుంది. ఇక భర్త గౌతమ్ కిచ్లు ఆమెను ఎప్పుడూ ఉల్లాసపరిచేందుకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారట.
తాజాగా గౌతమ్ తనకు దూరంగా ఉండడంతో.. ఈ భామ ఆరోపించారు. తన నాణ్యమైన సమయాన్ని వెచ్చించలేకపోతున్న భర్త ఆమెకు ఎలా లంచం ఇస్తున్నారో ఫోటోల రూపంలో పంచుకున్నారు. చేతి నిండా చాకో బార్ లతో కనిపించారు కాజల్. ఎక్కువ సమయం గడపలేకపోతున్నందుకు మా ఆయన ఇలాంటి లంచాలిస్తున్నారు! దీనివల్ల ఆరోగ్యం చెడుతుందని కూడా అన్నారు కాజల్. ఇంతకుముందు మనాలీ ట్రిప్ తర్వాత మళ్లీ కాజల్ తన భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లాలన్నా కుదరడం లేదుట. అందుకే ఈ కలత.
కెరీర్ మ్యాటర్ కి వస్తే...ఇటీవలే కాజల్ నటించిన ముంబై సాగా.. మోసగాళ్లు చిత్రాలు రిలీజయ్యాయి. తదుపరి ఆచార్యలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తోంది. భారతీయుడు 2.. హే సినామికా లాంటి చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి.