చందమామ కాజల్ అగర్వాల్ నిండు గర్భిణి. త్వరలో పండంటి బిడ్డకి జన్మనిచ్చి మాతృమూర్తి కాబోతుంది. టైమ్ టై టైమ్ ట్రెయినర్ సమక్షంలో చిన్న పాటి ఎక్సర్ సైజులు...డైట్ తీసుకుంటూ ఇంట్లోనే కాలక్షేపం చేస్తోంది. వాటికి సంబంధించిన ఫోటోలు ..వీడియోలు అభిమానులకు షేర్ చేస్తూ కుటుంబ సభ్యులతోనే ఉంటుంది.
అయితే ఇన్ స్టాలో తనదైన మార్క్ యాక్టివిటీ మాత్రం తగ్గలేదు. ఎప్పటికప్పుడు గర్భీణిగా ఉన్న కొత్త ఫోటోల్ని సైతం ప్రమోషనల్ గా వినియోగించుకుంటుంది.
ఇటీవలే శరీరం మొత్తం కంపర్ట్ గా ఉండే క్యాజువల్ తెలుపు దుస్తులు ధరించి చందమామ మోచేతులపై బ్యాలెన్స్ చేస్తూ పక్కకు పడుకుని కెమెరాకి ఫోజులిచ్చింది. అవి నెట్టింట జోరుగా వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి చందమామ ఆకర్షణీయమైన ఫోటోతో అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. టాప్ టూ బాటమ్ నలుపు వర్ణం దుస్తులు ధరించి సమ్ థింగ్ స్పెషల్గా ఫోకస్ అవుతుంది. అందులో కాజల్ బేబితో కూడిన ఎత్తైన పొట్ట సైతం అంతే హైలైట్ అవుతుంది.
ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. అభిమానులు ఆసక్తికర కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. వీటిలో మెజార్టీ భాగం పోస్టులు కాజల్ ఆరోగ్యానికి సంబంధించినవి కావడం విశేషం. కాజల్ గర్బిణీగా ఉన్న నేపథ్యంలో ఆమెకు ఆరోగ్య సూత్రాలు..సూచనలు..సలహాలు ఇస్తూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే తమిళ్..తెలుగు..హిందీ అంటూ మూడు భాషల్ని చుట్టేస్తోంది. కోలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేస్తోంది.
కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తయ్యాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన `ఆచార్య` నటిస్తోంది. చిరంజీవితో కలిసి నటించడం ఇది రెండవ సారి. గతంలో `ఖైదీ నెంబర్ 150` లో మెగాస్టార్ కి జోడీగా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అదే సెంటిమెంట్ తో కొరటాల శివ మరోసారి కాజల్ ని చిరు సరసన `ఆచార్య`లో రిపీట్ చేసారు. `ఇండియన్ -2` లో విశ్వ నటుడు కమల్ హాసన సరసన నటిస్తోంది.