కాజల్‌, రకుల్‌, తాప్సీ.. షాపింగే

Update: 2015-07-07 04:31 GMT
సీనియర్‌ సూపర్‌స్టార్‌గా ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నా కూడా.. ఈ మధ్యన తెలుగు సినిమాలు సైన్‌ చేయట్లేదు మన కాజల్‌. ఇక ఎప్పటినుండో ఎదురుచూసిన ఆ హిట్టు మొన్ననే కొట్టింది తాప్సీ. ఇకపోతే ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న యంగ్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సాంగ్‌. ఈ ముగ్గురు నాన్‌ తెలుగు స్టార్లు ఇప్పుడు తెలుగు వారి కోసం అమెరికాలో అడుగెట్టారు. నాట్స్‌, తానా వంటి ఆర్గనైజేషన్లు చేపట్టిన తెలుగు సంబరాలకు వీరు అతిథులుగా హాజరయ్యారు.

ఇకపోతే నాలుగు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమాలు పూర్తయిపోగానే మన హీరోయిన్లు ముగ్గురూ షాపింగ్‌లో మునిగిపోయారట. కాజల్‌ చక్కగా తన చెల్లి, డాడ్‌ అండ్‌ మామ్‌తో యుఎస్‌లో ఇంకో వారం ఉండి అక్కడి ప్రదేశాలన్నీ చూసేసి హ్యాపీగా షాపింగ్‌ చేసుకొని వస్తుందట. ఇక తాప్సీ పిల్ల తొలిసారిగా అమెరికా వెళ్ళింది కాబట్టి ఆమె కూడా ఓ నాలుగు రోజులు స్పెండ్‌ చేసి వద్దామనే అక్కడ వేచియుంది. అమ్మడు కూడా ఆల్రెడీ షాపింగులో బిజీగా ఉంది. ఇక మన రకుల్‌ ప్రీత్‌ అంటారా.. ఆమె ఫాస్టు ఫాస్టుగా షాపింగులు చేసేసుకొని చక్కగా లండన్‌ చెక్కేయాలట. ఎందుకంటే అక్కడ కొన్ని రోజులపాట ఎన్టీఆర్‌ షూటింగ్‌లో పాల్గొనాలిగా మరి. మొత్తానికి ఈ భామలు ఎక్కడకు వెళ్ళినా కూడా షాపింగ్‌ మాత్రం కామన్‌ అయిపోయింది. ఇంతకీ పాపలూ ఏం కొంటున్నారు?

Tags:    

Similar News