నేనే చెత్త డ్యాన్సర్.. కాదు నేనే

Update: 2015-10-14 11:30 GMT
ఇండస్ట్రీలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అన్న చర్చ వస్తుంటుంది కానీ.. చెత్త డ్యాన్సర్ ఎవరన్న డిస్కషన్ ఎప్పుడైనా నడుస్తుందా? అది కూడా నేను చెత్త డ్యాన్సర్ అంటే కాదు కాదు నేనే చెత్త డ్యాన్సర్ అంటూ ఇద్దరు హీరోలు గొడవ పడతారా? బాలీవుడ్ లో ఇలాంటి గొడవే నడుస్తోంది. మెగా స్టార్ అమితాబ్ బచ్చన్.. బాద్ షా షారుఖ్ ఈ విషయంలో ట్విట్టర్ వేదికగా గొడవకు దిగారు. ఇంతకీ ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే..

ప్రస్తుతం షారుఖ్ ఖాన్ మన హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ‘దిల్ వాలే’ షూటింగులో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అక్కడ తన ఎవర్ గ్రీన్ జోడీ కాజల్ తో కలిసి స్టెప్పులేస్తున్నాడు షారుఖ్. నిన్న రాత్రంతా ఓ పాట షూటింగ్ జరిగిందని.. ప్రపంచంలోనే వరస్ట్ డ్యాన్సర్ల మైన తాను, కాజోల్ కలిసి డ్యాన్స్ చేశామని.. తాను వరస్ట్ డ్యాన్సర్ అని నిజాయితీగా ఒప్పుకుంటున్నానని ట్వీట్ పెట్టాడు షారుఖ్.

ఈ ట్వీట్ చూసి అమితాబ్.. షారుఖ్ ను తప్పుబట్టాడు. మీరిద్దరూ బెస్ట్ బెస్ట్ డ్యాన్సర్స్.. నేనే వరస్ట్ వరస్ట్ డ్యాన్సర్.. ఈ విషయం ప్రూవ్ అయింది అన్నాడు. ఈ ట్వీట్ మీద మళ్లీ షారుఖ్ రెస్పాండయ్యాడు. చెత్త డ్యాన్స్ విషయంలో మీతో పోటీ పెడితే నేనే గెలుస్తానన్నాను.. డ్యాన్సుల్లో నాకు చెత్త ట్రాక్ రికార్డు ఉందని ట్వీట్ చేశాడు. వీళ్ల గొడవ ట్విట్టర్ జనాలకు భలే వినోదాన్నయితే పంచింది.
Tags:    

Similar News