RX 100 హీరోకి ర‌జ‌నీ నిర్మాత పొగడ్త

Update: 2019-04-04 13:39 GMT
ఆర్.ఎక్స్ 100 త‌ర్వాత కార్తికేయ కెరీర్ గురించి తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. న‌ట‌వార‌స‌త్వ ం లేక‌పోయినా బండి లాక్కెళ్లే హీరో అని అంతా పొగిడేశారు. కార్తికేయ ఎన‌ర్జిటిక్ పెర్ఫామ‌ర్... మ‌నోడిలో మ్యాట‌ర్ ఉంది. ఎమోష‌న్ ని పండించ‌గ‌ల స‌త్తా ఉన్న హీరో అంటూ క్రిటిక్స్ ఆకాశానికెత్తేశారు. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో స‌న్నివేశ‌మేంటి? అంటే హిప్పీ చిత్రంతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టేస్తాన‌ని తుపాకికి ప్ర‌త్యేకంగా తెలియ‌జేశారు. హిప్పీలో ఏం కొత్త‌ద‌నం ఉంటుంది? అన్న ప్ర‌శ్న‌కు ఇందులో ప్రేమికుడి పాత్ర కొత్త‌గా ఉంటుంద‌ని తెలిపారు. బాక్సింగ్ నేప‌థ్య ం ఉన్న క‌థాంశం అన్నారు క‌దా? అప్ప‌ట్లో పోస్ట‌ర్లు అలానే క‌నిపించాయి? అన్న ప్ర‌శ్న‌కు బాక్సింగ్ నేప‌థ్య ం ఉంటుంది. అది కేవ‌లం ఒక పార్ట్ మాత్ర‌మే. కిక్కిచ్చే బాక్సింగ్ పంచ్ లు ఉంటాయి.. అని తెలిపారు.

గౌత‌మ్ మీన‌న్ శిష్యుడు టి.ఎన్‌. కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం  వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని క‌బాలి నిర్మాత‌లు క‌ళైపులి ఎస్.థాను వంటి టాప్ రేంజు మేక‌ర్స్ నిర్మిస్తున్నారు. దిగంగ‌న సూర్య వంశీ క‌థానాయిక గా న‌టిస్తోంది. జేడీ చ‌క్ర‌వర్తి కీల‌క పాత్రను పోషిస్తున్నారు. నేడు హైద‌రాబాద్ లో హిప్పీ యూనిట్ పాత్రికేయ స‌మావేశంలో ముచ్చ‌టించింది. క‌థానాయ‌కుడు కార్తికేయ మాట్లాడుతూ- ఆర్.ఎక్స్ 100 త‌ర్వాత చాలా అవ‌కాశాలొచ్చాయి. ఒక విభిన్న‌మైన పాత్ర‌లో న‌టించాల‌ని కొంత వేచి చూశాను. అంద‌రికీ న‌చ్చే కొత్త ప్ర‌య‌త్నం  చేయాల‌ని అనుకున్నాను. ఆ క్ర‌మంలోనే నువ్వు నేను ప్రేమ ద‌ర్శ‌కుడు .. గౌత‌మ్ మీన‌న్ శిష్యుడు టి.ఎన్.కృష్ణ మంచి క‌థ ఉంద‌ని వినిపించారు. క్లాస్ డైరెక్ట‌ర్ అని ఊహిస్తే అత‌డు ప‌క్కా ఎంట‌ర్ టైనింగ్ సినిమా తీశారు. రియ‌లిస్టిక్ గా ఉంటూనే పూర్తి వినోదాత్మ‌కంగా ఉండే చిత్ర‌మిది. రెండో సినిమానే క‌బాలి నిర్మాత‌ల‌తోనా.. అనుకున్నాను. అది నా అదృష్టం. జేడీ చ‌క్ర‌వ‌ర్తి త‌న స్వ‌భావానికి ద‌గ్గ‌ర‌గా ఉండే పాత్ర‌లో న‌టించారు. అంద‌రూ సీనియ‌ర్ న‌టుల మ‌ధ్య నేనూ ఎక్క‌డా త‌గ్గ‌కుండా ప్ర‌య‌త్నించాను. వంద శాతం బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఇది`` అని తెలిపారు.

నిర్మాత క‌ళైపులి ఎస్.థాను మాట్లాడుతూ -ఆర్.ఎక్స్ 100 లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాక కార్తికేయ న‌న్ను సంప్ర‌దించాడు. అంత పెద్ద హిట్టు కొట్టి నా అవ‌స‌రమేంటి?  మీతో ఎవ‌రైనా సినిమాలు తీస్తారు క‌దా? అని ప్ర‌శ్నించాను. మంచి క‌థ దొరికింది. మీరే చేయాలి అని విన‌మ్రంగా అడిగాడు. హిప్పీ రిలీజ్ త‌ర్వాత కార్తికేయ ముందు వ‌రుస‌లో హీరోగా నిలుస్తాడు. అలాగే జేడీ పూర్తి స్థాయిలో న‌వ్వించే పాత్ర‌లో న‌టించ‌డు. ఇత‌ర కాస్టింగ్ అద్భుతంగా కుదిరారు. ద‌ర్శకుడు ప్ర‌తిభావంతంగా తెర‌కెక్కించాడు... అని తెలిపారు. ద‌ర్శ‌కుడు కృష్ణ మాట్లాడుతూ- 48 రోజుల్లో సినిమా పూర్తి చేశాం. కార్తికేయ పుట్టుక‌తోనే హీరో అని అన‌గ‌ల‌ను. ఎలాంటి పాత్ర‌లో అయినా ఒదిగిపోయే ప్ర‌తిభ ఉన్న హీరో. గొప్ప హీరోగా ఎద‌గాలి. చెలి, ఘ‌ర్ష‌ణ టైమ్ నుంచి గౌత‌మ్ మీన‌న్ శిష్యుడిగా ప‌ని చేశాను. నువ్వు నేను ప్రేమ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వ ం వ‌హించాను. ఇప్పుడు హిప్పీకి థాను స‌ర్ గొప్ప అవ‌కాశం ఇచ్చారు. .. అని తెలిపారు. హిప్పీ నా ఫేవ‌రెట్ మూవీ అని చెప్ప‌గ‌ల‌నని సినిమాటోగ్రాఫ‌ర్ ఆర్‌.డి.రాజ‌శేఖ‌ర్ అన్నారు. హిప్పీ అంటే సంచార జీవి. ప్రేమ నుంచి ప్రేమ‌కు మారే సంచార జీవి క‌థ తో ఈ సినిమా చేశార‌ని లిరిసిస్ట్ అనంత శ్రీ‌రామ్ తెలిపారు.

Tags:    

Similar News