కియ‌రా ఆ క్లాసిక్ నటికి ఫాలోవ‌ర్

Update: 2019-03-29 16:49 GMT
ముంబై బ్యూటీ కియ‌రా అద్వాణీ ఇటీవ‌ల‌ టాలీవుడ్ లో మెరుపులు మెరిపించిన సంగ‌తి తెలిసిందే. ఆరంగేట్ర‌మే మ‌హేష్ స‌ర‌స‌న `భ‌ర‌త్ అనే నేను` చిత్రంలో న‌టించింది. తొలి ప్ర‌య‌త్నం బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న ఈ బ్యూటీ అటుపై చ‌ర‌ణ్ స‌ర‌స‌న `విన‌య విధేయ రామ` చిత్రంలో న‌టించింది. ఆ సినిమాతో ఫ్లాప్ ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కియ‌రా టాలీవుడ్ లో వేరొక స్టార్ హీరో సినిమాకి క‌మిటైంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఈలోగానే ఈ బ్యూటీ న‌టించిన బాలీవుడ్ చిత్రం `క‌ళాంక్` రిలీజ్ కి రెడీ అవుతోంది.

ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ సీజ‌న్ లో రిలీజ‌వుతున్న భారీ బ‌డ్జెట్ చిత్రంగా చెబుతున్నారు. ఈ సినిమా కోసం క‌ర‌ణ్ బృందం ఏకంగా 100 కోట్ల బ‌డ్జెట్ ని ఖ‌ర్చు చేస్తోంది. ఇందులో ఆలియాభ‌ట్, వ‌రుణ్ తేజ్, మాధురి ధీక్షిత్, సంజ‌య్ ద‌త్ వంటి స్టార్లు న‌టిస్తున్నారు. ఇంత భారీ కాన్వాసు.. భారీ కాస్టింగ్ ఉన్న ఈ చిత్రంలో కియ‌రా ఎలాంటి పాత్ర‌లో న‌టిస్తోంది? అంటే అందుకు సంబంధించి తాజాగా ఓ వీడియో రిలీజైంది. `ఫ‌స్ట్ క్లాస్...` అంటూ సాగే ఈ పాట‌లో వ‌రుణ్ ధావ‌న్ తో క‌లిసి కియ‌రా వేసిన మైండ్ బ్లోవింగ్ స్టెప్పులు మైమ‌రిపిస్తున్నాయి.

కియ‌రా ఈ పాట‌లో అంత అందంగా క‌నిపించ‌డానికి కార‌ణం అల‌నాటి మేటి క‌థానాయిక మ‌ధుబాల‌ను అనుస‌రించ‌డ‌మేన‌ని తెలుస్తోంది. ఈ సినిమాలో పాత్ర కోసం మేటి క‌థానాయిక మ‌ధుబాల న‌టించిన క్లాసిక్ సినిమాలు చూసిందట‌. నాటి క్లాసిక్ సాంగ్స్ లో మ‌ధూ అభిన‌యం, డ్యాన్సింగ్ స్కిల్స్ స‌హా ప్ర‌తిదీ కియ‌రా త‌న‌కు అడాప్ట్ చేసుకుంది. లెజెండ‌రీ మ‌ధుబాల‌కు కియరా వీరాభిమాని. అందుకే త‌న‌ను ఫాలో అవుతోంద‌ట‌. ఇక ఈ పాట‌లో త‌న డ్రెస్ డిజైన్ కోసం ప్ర‌ఖ్యాత ఫ్యాష‌న్ డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రాని సంప్ర‌దించింది. మ‌ధుబాల న‌ర్తించిన క్లాసిక్ జ‌బ్ ప్యార్ కియా తో డ‌ర్నా క్యా, మోహె పంఘ‌త్ పే (మొఘ‌ల్ ఏ అజ‌మ్ 1960) పాట‌ల్ని వీక్షించింద‌ట‌. అభిషేక్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి ప్రీత‌మ్ సంగీతం అందించారు. రెమో డి.సౌజా ఈ రెండో పాట‌కు కొరియోగ్ర‌ఫీ అందించారు. ఇదివ‌ర‌కూ రిలీజైన `ఘ‌ర్ మోర్ ప‌ర‌దేసియా..` పాట‌కు చక్క‌ని స్పంద‌న వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ 17 న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. టాలీవుడ్ లోనూ మెట్రో న‌గ‌రాల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంద‌ని తెలుస్తోంది.


Full View

Tags:    

Similar News