విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'దొరసాని'. ఇదే సినిమా ద్వారా డా.రాజశేఖర్ - జీవితల రెండవ కుమార్తె శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. 'దొరసాని' జూలై 12 న విడుదలకు సిద్ధం అవుతోంది. సినిమా రిలీజ్ కు మరో ఇరవై రోజులే ఉండడంతో 'దొరసాని' టీమ్ ప్రమోషన్స్ లో జోరు పెంచారు. తాజాగా ఈ సినిమా నుండి కళ్ళలో కలవరమై అంటూ సాగే ఒక లిరికల్ సింగిల్ ను విడుదల చేశారు.
'దొరసాని' చిత్రానికి ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నాడు. ఈ పాటకు సాహిత్యం అందించినవారు శ్రేష్ఠ. ఈ పాటను ఆలపించిన వారు చిన్మయి శ్రీపాద. కళ్ళలో కలవరమై కలవరమై... గుండెల్లో పరవశమో వరమై..కళ్ళలో కలవరమై కలవరమో వరమే అవ్వగా కళ్ళలో కలవరమై కలవరమై గుండెల్లో పరవశమే వశమై కళ్ళలో కలవరమై కలవరమై కలిగే కోరిక" అంటూ సాగింది సాహిత్యం. పదాలతో నిజంగా ఒక ఆట ఆడేసుకుంది లిరిసిస్ట్ శ్రేష్ఠ. అందమైన పదాలతో ఒక పూల దండ కూర్చినట్టుగా లిరిక్స్ అందించారు. ఈమధ్య కాలంలో ది బెస్ట్ లిరిక్స్ లో ఇదొకటి. వీలుంటే తీరిగ్గా రిపీట్ మోడ్ లో వింటూ ఆ పదాలను గమనించండి. ఇలాంటి లిరిక్స్ అందించిన ఆమెకు ఒకసారి తప్పకుండా ఇంగ్లీష్ లో హ్యాట్స్ ఆఫ్ కాకుండా తెలుగులో జేజేలు చెప్పుకోవాలి. ఇక ఈ పాటను అంతకంటే అందంగా పాడి కొత్త అందాన్ని తీసుకొచ్చింది చిన్మయి. ప్రశాంత్ విహారి ట్యూన్ కూడా సూపర్బ్. ఓవరాల్ గా ఇట్స్ ఎ వెరీ గుడ్ సాంగ్. రెండు మూడు సార్లు వింటే ప్రేమలో పడిపోతారు.
కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మథుర శ్రీధర్.. యష్ రంగినేని మథుర ఎంటర్టైన్మెంట్.. బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డీ. సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ద్వారా సమర్పిస్తున్నారు.
Full View