‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాతో యువ దర్శకుడు కళ్యాణ్ కృష్ణకు లైఫ్ ఇచ్చింది అక్కినేని నాగార్జునే. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత తన బేనర్లోనే ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాకు కూడా అవకాశమిచ్చాడు. అది కూడా సూపర్ హిట్టయింది. ఐతే ఈ రెండు సినిమాలతో అక్కినేని కుటుంబానికి కళ్యాణ్ కృష్ణ చేసిన సాయాన్ని కూడా మరిచిపోకూడదు. గత రెండు దశాబ్దాల్లో ‘సోగ్గాడే..’ స్థాయిలో అన్నపూర్ణ బేనర్ కు లాభాలు తెచ్చిన సినిమా మరొకటి లేదు. వరుస ఫ్లాపులతో నాగార్జున మార్కెట్ బాగా దెబ్బ తిన్న సమయంలో ఆయనకు మళ్లీ లైఫ్ ఇచ్చిన సినిమా ఇది. మరోవైపు ‘రారండోయ్..’ కూడా నాగ్ సంస్థకు మంచి లాభాలు అందించింది. చైతూ కెరీర్ కు ఈ సినిమా బాగా ఉపయోగపడింది.
ఐతే తనకు.. తన కొడుక్కి.. తన బేనర్ కు ఇంతగా లాభం చేకూర్చిన కళ్యాణ్ కృష్ణను నాగార్జున ఇబ్బంది పెట్టినట్లుగా వార్తలొచ్చాయి. కళ్యాణ్ కృష్ణ తన మూడో సినిమాను బయటి బేనర్లో రవితేజ హీరోగా చేయాలని అనుకోగా.. నాగ్ అడ్డం పడ్డాడని.. తన బేనర్లోనే ఇంకో సినిమా చేయడానికి కమిట్మెంట్ ఉన్న నేపథ్యంలో కళ్యాణ్ ను వదలడానికి అంగీకరించలేదని గుసగుసలు వినిపించాయి. ఐతే నాగ్ బేనర్లోనే సినిమా చేద్దామంటే కథకు ఆమోద ముద్ర మాత్రం పడలేదు. ‘బంగార్రాజు’ స్టోరీ విషయంలో బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు నాగ్. ఇది కళ్యాణ్ కృష్ణను బాగా ఇబ్బంది పెట్టింది. ఐతే చివరికి ఏం జరిగిందో ఏమో.. ఇప్పుడు కళ్యాణ్ కృష్ణకు నాగ్ నుంచి విడుదల లభించింది. అతను బయటి బేనర్లో రవితేజ హీరోగా సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా గురించి ప్రకటన కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా నాగార్జునకు థ్యాంక్స్ చెబుతూ ఎమోషనల్ ట్వీట్ పెట్టాడు కళ్యాణ్. ఈ థ్యాంక్స్ తనకు అవకాశాలిచ్చినందుకా.. తనను వేరే సినిమా చేసుకోవడానికి రిలీజ్ చేసినందుకా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు జనాలు.