ఒక్క సాంగ్ కోసం 75 ట్యూన్స్.. బీజీఎం కోసం 30 రోజులు..!

Update: 2021-02-17 08:30 GMT
క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి - యూత్ స్టార్ నితిన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'చెక్'. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ - ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రానికి కీరవాణి తమ్ముడు కల్యాణీ మాలిక్‌ సంగీతం సమకూరుస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో కథానుగుణంగా ఒక్క పాటకు మాత్రమే సందర్భం కుదిరిందట. ఈ సాంగ్ ని నితిన్‌ - ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ లపై చిత్రీకరించారు. అయితే ఈ పాట కోసం 75 ట్యూన్లు వినిపించాల్సి వచ్చిందని కల్యాణీ మాలిక్ వెల్లడించాడు.

కల్యాణీ మాలిక్ ఇటీవల మాట్లాడుతూ.. ఈ సినిమాలో వున్న రొమాంటిక్ సాంగ్ కోసం 75 ట్యూన్లు వినిపిస్తే కానీ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి సంతృప్తి చెందలేదని చెప్పుకొచ్చారు. కథానుగుణంగా సినిమా మొత్తం మీద ఒకే ఒక పాటకు స్కోప్ వుందని.. ఇదేదో కావాలనీ చేసింది కాదని వివరించాడు. అయితే సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా కీలకంగా వుంటుందని.. దాని కోసం 30 రోజుల టైమ్ పట్టిందని.. ఇన్ని రోజులు నేపథ్య సంగీతం కోసం వర్క్ చేయడం ఫస్ట్ టైం అని కల్యాణి మాలిక్ వెల్లడించారు. ఇకపోతే నితిన్ సినిమాలో ఒకే సాంగ్ ఉండడం మొదటి సారి. ఇటీవలే విడుదలైన ఈ సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. 'చెక్' సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Tags:    

Similar News