నేను అప్పుల్లో మునిగిపోలేదు - కళ్యాణ్ రామ్!

Update: 2016-10-20 12:33 GMT
సినిమాలకు సంబందించిన ఆర్ధిక విషయాలు.. పెట్టుబడులు, వసూళ్లు, నటీనటుల రెమ్యునరేషన్లు ఇలాంటి విషయాలపై వాస్తవాలు ఎలా ఉన్నా, గాసిప్పులు మాత్రం తెగ హల్ చల్ చేస్తుంటాయి. ఆ సినిమాకు అంత బడ్జేట్ అయ్యిందని, ఈ సినిమా ఇంత వసూల్ చేసిందని, ఆ హీరో హీరోయిన్లు ఆ స్థాయిలో రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారని రూమర్లు తెగ వ్యాపించేస్తుంటాయి. ఈ రూమర్ల వల్ల ఐటీ దాడులు జరిగిన సంగతులుకూడా టాలీవుడ్ కు అనుభవమే. ఇదే క్రమంలో తాజాగా "ఇజం" హీరో కం నిర్మాత కళ్యాణ్ రామ్ పై కూడా రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. "ఇజం" సినిమాకు విపరీతంగా ఖర్చుపెట్టేశారని, తీరా బిజినెస్ మాత్రం ఆస్థాయిలో అవ్వలేదని, ఇప్పటికే "ఓం 3డి" తో బలమైన దెబ్బ తిన్న ఈ నందమూరి హీరో మరోసారి దెబ్బతిన్నాడని, ఈ దెబ్బకు ఇప్పట్లో తేరుకోవడం కష్టమే అని ఇలా రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే... ఈ విషయాలపై స్పందించాడు కళ్యాణ్ రామ్.

"ఇజం" సినిమా బడ్జెట్ రూ.25 కోట్లని, అయితే బిజినెస్ మాత్రం కేవలం రూ.20 కోట్లకే జరిగిందని వస్తోన్న వార్తలపై కళ్యాణ్ రామ్ స్పందించారు. ఇందులో వాస్తవం ఏమాత్రం లేదంటున్న కళ్యాణ్ రామ్... తన ఆర్ధిక పరిస్థితిపై వస్తోన్న ఊహాగానాలన్నీ అవాస్తవాలే అని కొట్టిపారేశాడు. ఇంకా కళ్యాణ్ రామ్ ఈ విషయంపై మాట్లాడుతూ... "ఇజం సినిమాకు ఖర్చు మరీ ఎక్కువేమీ పెట్టేయలేదు.. అనుకున్నదానికంటే బడ్జెట్ కాస్త అటు ఇటు అయి ఉండొచ్చు.. ఇది చాలా సాదారణమైన విషయం.. దీంతో కొంత ఇబ్బంది వచ్చి ఉండొచ్చు.. కానీ, నా గురించి వినిపిస్తున్న రూమర్లు మాత్రం వాస్తవం కాదు! కళ్యాణ్ రామ్ అయిపోయాడు.. అప్పుల్లో మునిగిపోయాడు.. వంటి విషయాలన్నీ కేవలం ఊహాగానాలే.. నిజంగా నేను అలాంటి పరిస్థితుల్లోనే ఉంటే ఇంకో సినిమా ఎలా చేయగలను" అని ప్రశ్నించాడు.

ఇదే సమయంలో తన సొంత బేనర్లోనే ఎక్కువ సినిమాలు చేయడంపై కూడా నందమూరి కళ్యాణ్ రామ్ స్పందించారు. బయట బ్యానర్లలో సినిమాలు చేయాలని తనకూ ఉంటుందని, అయితే ఒక దర్శకుడు తనవద్దకు మంచి సబ్జెక్ట్ తో వస్తే ఆ కథకు తాను టెంప్ట్ అయిపోయి సొంత బేనర్లోనే చేస్తుంటానని తెలిపాడు. మరికొన్ని సందర్భాల్లో అయితే ఆ రిస్కేదో తానే భరించాలని కూడా అనిపిస్తుంటుందని చెప్పాడు. ఇకపై కచ్చితంగా, సీరియస్‌ గా ఇతర బ్యానర్లలో సినిమాలు చేయడంపై దృష్టిపెడతానని అని కళ్యాణ్ రామ్ చెబుతున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News