నాలుగు లైన్ లో ఉన్నా నంద‌మూరి హీరో ఎందుకీ డైల‌మా?

Update: 2021-03-07 10:37 GMT
ఓవైపు హీరోగా న‌టిస్తూనే త‌న సోద‌రుడు ఎన్టీఆర్ హీరోగా సినిమాలు నిర్మిస్తున్నారు క‌ళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ 30 కి ఆయ‌న కూడా ఒక నిర్మాత‌. అయితే క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టిస్తున్న‌వేవీ ఇంకా రిలీజ్ కి రాక‌పోవ‌డ‌మే విస్మ‌య‌ప‌రుస్తోంది. లాక్ డౌన్ కి ముందే నాలుగు సినిమాలు లైన్ లో పెట్టిన క‌ళ్యాణ్ రామ్ నుంచి ఎందుక‌నో కానీ సౌండ్ లేదు. ఒక్క సినిమా అప్ డేట్ కూడా లేదు.

దీనికి కార‌ణ‌మేమిటి? అన్న‌ది ఆరా తీస్తే .. లో ప్రోఫైల్ మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్లాల‌ని క‌ళ్యాణ్ రామ్ అనుకుంటున్న‌ట్లుగా సమాచారం. అయితే స‌డెన్ గా ఎందుకీ డెసిష‌న్ అస‌లైమైంది? అంటూ.. ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూనే.. దీని పై ఇండ‌స్ట్రీలో ఫన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఎంతో హ‌డావుడి చేస్తేనే క‌ళ్యాణ్ రామ్ సినిమాల‌కి ఓపెనింగ్స్ భారీగా ర‌వ‌డం క‌ష్టం. అలాంటిది ఎలాంటి సౌండింగ్ లేక‌పోతే మొద‌టికే మోసం వ‌స్తుందేమో అని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి వీట‌న్నిటికీ చెక్ పెట్టేలా క‌ళ్యాణ రాముడు దూసుకొస్తాడేమో చూడాలి. ఈ సైలెన్స్ వెన‌క లాజిక్ ఏదైనా చెప్పి స‌రిపెట్ట‌కుండా మాంచి బ్లాక్ బ‌స్ట‌ర్ తో కంబ్యాక్ అద‌ర‌గొడ‌తాడేమో చూడాలి.


Tags:    

Similar News