నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తన కెరీర్లో అతి పెద్ద పరీక్షకు సిద్ధమయ్యాడు. ఈ కథానాయకుడి కెరీర్లో ‘అతనొక్కడే’.. ‘పటాస్’ లాంటి భారీ విజయాలున్నాయి. అలాగే ఎన్నో డిజాస్టర్లూ.. ఫ్లాపులూ ఉన్నాయి. ఐతే ఫలితాల మాటెలా ఉన్నా.. ఇప్పటిదాకా అతను చేసిన సినిమాలన్నీ ఒకరకం. కెరీర్ ఆరంభం నుంచి తనకు అలవాటైన మాస్ కథల్లోనూ అతను నటిస్తూ వస్తున్నాడు. ‘పటాస్’ లాంటి సినిమాల్లో కొత్తగా కామెడీ ట్రై చేసినా.. అక్కడా మాస్ టచ్ పోనివ్వలేదు. నటుడిగా అతను తన స్టయిల్లో తాను సాగిపోయాడు. భిన్నంగా ఏమీ చేయాల్సిన అవసరం లేకపోయింది. కానీ ఇప్పుడు అతడి కొత్త సినిమా ‘నా నువ్వే’లో మాత్రం ఇప్పటిదాకా చేయనిది చాలా చేయాల్సి వచ్చింది. లుక్.. బాడీ లాంగ్వేజ్.. యాక్టింగ్ స్టైల్.. డైలాగ్ డెలివరీ అన్నీ మార్చుకోవాల్సి వచ్చింది.
ప్రోమోలు చూస్తేనే ‘నా నువ్వే’ కళ్యాణ్ రామ్ సినిమా కాదన్న ఫీలింగ్ కలిగింది అందరికీ. ఇలాంటి సినిమాలో అతను నటించడం అందరికీ ఆశ్చర్యమే. మరి తనకు అలవాటు లేని పాత్రలో.. కథలో కళ్యాణ్ రామ్ ఎలా మెప్పిస్తాడన్నది ఆసక్తికరం. ‘నా నువ్వే’ కాంబినేషన్ ముందు ఆసక్తి రేకెత్తించింది కానీ.. సినిమా విడులకు ముందు దీనికి ఆశించినంత బజ్ అయితే లేదు. కళ్యాణ్ రామ్ గత సినిమా ‘ఎమ్మెల్యే’కు ఈ పరిస్థితి లేదు. అది గొప్పగా ఆడకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ పర్వాలేదు. ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. కానీ ‘నా నువ్వే’ పరిస్థితే కొంచెం ఆందోళనకరంగా ఉంది. బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. ఈ నేపథ్యంలో తనకు అలవాటు లేని పాత్రలో తనేంటో రుజువు చేసుకోవడమే కాక.. ఈ సినిమాతో ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించి కమర్షియల్ సక్సెస్ సాధించడం కూడా కళ్యాణ్ రామ్ కు సవాలే. మరి అతను ఈ పరీక్షలో ఏమాత్రం విజయవంతమవుతాడో చూడాలి. తమన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి జయేంద్ర దర్శకుడు.