నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో నందమూరి కల్యాణ్ రామ్ శైలి ప్రత్యేకం. నేడు ( జూలై 5 మంగళవారం) ఆయన పుట్టిన రోజు. `బాలగోపాలుడు` సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు. 2003లో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించిన `తొలి చూపులోనే` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆశించిన విజయం దక్కలేదు. ఆ తరువాత ఆయన హీరోగా తొలి విజయాన్ని సొంతం చేసుకోవడానికి రెండేళ్లు పట్టింది. దానికి కూడా కల్యాణ్ రామ్ నిర్మాతగా మారి భారీ స్థాయిలో రిస్క్ చేస్తే తప్ప అతనికి సక్సెస్ వరించలేదు. కల్యాణ్ రామ్ రిస్క్ చేసి మరీ సక్సెస్ ని సొంతం చేసుకున్న మూవీ `అతనొక్కడే`.
ఇదే సినిమాతో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ని స్థాపించి ఈ మూవీ కోసంచాలా పెద్ద రిస్కే చేశారు. సురేందర్ రెడ్డి రివేంజ్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ హీరోగా కల్యాణ్ రామ్ కెరీర్ ని మలుపు తిప్పి ఆయనని హీరోగా నిలబెట్టింది. ఆ తరువాత కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ప్రయోగాలు చేస్తూనే వచ్చారు. స్టార్ డైరెక్టర్లతో వర్క్ చేసే అవకాశం వున్నా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తన బ్యానర్ లోనే సినిమాలు చేస్తూ కొత్త వారిని ప్రోత్సహిస్తూ వస్తున్నారు.
`ఓం 3డీ` వంటి ఎదురు దెబ్బలు తగిలినా ఎక్కడా రాజీపడకుండా అదే పంథాని అనుసరిస్తూ ముందుకు సాగుతున్నారు. కొత్త తరహా సినిమాలతో పాటు స్టార్ డైరెక్టర్లతో కలిసి పాన్ ఇండియా మూవీస్ చేసే సత్తా, ఫేమ్ వున్నా ఇప్పటికీ కొత్త వారికే అవకాశాలు ఇస్తూ ఆ సినిమాలని తానే నిర్మిస్తూ వస్తున్నారు. కథలోని కొత్తదనం, దర్శకుడి పని తీరు నచ్చిందా? అనుభవాన్ని కూడా ప్రశ్నించకుండానే అవకాశాలు ఇస్తుంటారు నందమూరి కల్యాణ్ రామ్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ `బింబిసార`. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు.
స్వీయ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాతగా వ్యవహరిస్తూ కల్యాణ్ రామ్ నటిస్తున్నారు. ఈ మూవీ ద్వారా కొత్త దర్శకుడు మల్లిడి వశిష్టని పరిచయం చేస్తున్నారు. చరిత్రలో మిగిలిపోయిన ఓ పోరాట యోధుడి కథకు సైన్స్ ని మిక్స్ చేసి సరికొత్త నేపథ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ప్రస్తుత కాలంతో పాటు పీరియాడిక్ స్టోరీగా విభిన్నంగా రెండు కాలాల నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. సోమవారం విడుదల చేసిన ట్రైలర్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
సినిమాలో 5 వ సెంచరీ కాలం నాటి మగధ సామ్రాజ్య కాలం నాటి పరిస్థితుల్లోని బింబిసారుడిగానూ, ప్రస్తుత కాలానికి చెందిన వ్యక్తిగానూ కల్యాణ్ రామ్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. అంతే కాకుండా ఇటీవల సీక్వెల్స్ పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో `బింబిసార` పార్ట్ 2 కూడా వుంటుందని కల్యాణ్ రామ్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తారని కూడా చెప్పడంతో ఈ మూవీతో పాటు సీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ఈ మూవీని ఆగస్టు 5న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కల్యాణ్ రామ్ నటించి అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అని నందమూరి ఫ్యాన్స్ తో పాటు విమర్శకులు సైతం అంటున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు కల్యాణ్ రామ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటించబోతున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ ఎవరు? అనే వివరాలు త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు.