టాలీవుడ్లో కొంతమంది హీరోలకు హిట్ వస్తే బాగుండు అని అటు ఇండస్ట్రీ జనాలు, ఇటు ప్రేక్షకులు కోరుకుంటూ ఉంటారు. నందమూరి కళ్యాణ్ రామ్ ఆ కోవకే చెందుతాడు. సినిమా కోసం అతనెంత సిన్సియర్‌గా కష్టపడతాడో, సొంత బేనర్ మీద ఎలా రిస్క్ చేసి సినిమాలు తీస్తాడో, కొత్త దర్శకులను ఎలా ప్రోత్సహిస్తాడో అందరికీ తెలుసు. ఆన్ లైన్లో అయినా, ఆఫ్ లైన్లో అయినా నో న్యూసెన్స్ అన్నట్లుగా కనిపించే అతను.. తన ప్రతి మాటలో సిన్సియారిటీ చూపిస్తాడు.
గతంలో చాలా కష్టపడి ఓం, హరే రామ్ లాంటి భారీ సినిమాలు ప్రయత్నించి దెబ్బ తినడంతో అతడిపై సానుభూతి కూడా ఉంది. ఇప్పుడు 'బింబిసార' కోసం అంతకుమించే కష్టపడ్డాడతను.
ఆ కష్టానికి ఇప్పుడు మంచి ఫలితమే దక్కుతోంది. విడుదలకు ముందే మంచి హైప్ తెచ్చుకున్న చిత్రానికి తొలి రోజు పాజిటివ్ టాక్ కలిసొచ్చింది. సినిమా బ్లాక్‌బస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. తొలి రోజే ఆరున్నర కోట్ల దాకా షేర్ రాబట్టి బయ్యర్ల పెట్టుబడిలో సగం మొత్తం వెనక్కి తెచ్చేసిందీ చిత్రం.
'బింబిసార'కు ఇలాంటి రెస్పాన్స్ రావడంతో ఈ చిత్ర విడుదలకు ముందు తిరుపతిలో జరిగిన ఒక ప్రెస్ మీట్లో కళ్యాణ్ రామ్ వ్యాఖ్యల తాలూకు వీడియో వైరల్ అవుతోంది. ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదు కదా అని ఓ విలేకరి ప్రస్తావిస్తే.. ఆ మాటను కళ్యాణ్ రామ్ తప్పుబట్టాడు. ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదని, రారని ఎవరు చెప్పారని ప్రశ్నించాడు.
మంచి కంటెంట్ ఇస్తే కచ్చితంగా ప్రేక్షకులు థియేటర్లకు పెద్ద ఎత్తున వస్తారని.. అందుకు మేజర్, విక్రమ్ సినిమాలు నిదర్శనం అని.. డబ్బింగ్ సినిమా అయిన విక్రమ్ మూవీని అంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులు మన సినిమాలను ఆదరించరా అని అతను అన్నాడు.
మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి ప్రేక్షకులను ఎగ్జైట్ చేసే, మంచి సినిమాలను అందిస్తే కచ్చితంగా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని, కాబట్టి ప్రేక్షకులను నిందించడం మాని వాళ్లకు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఇవ్వాలని కళ్యాణ్ రామ్ కుండబద్దలు కొట్టాడు. ఇప్పుడు 'బింబిసార'తో పాటు 'సీతారామం'కు వస్తున్న రెస్పాన్స్ చూస్తే కళ్యాణ్ రామ్ మాటలు అక్షర సత్యాలని ఒప్పుకోవాల్సిందే. అందుకే అతడి వీడియో వైరల్ అవుతోంది.
Full View