మంచివాడికి అంత ధీమా ఏమిటో?

Update: 2019-10-17 07:58 GMT
ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ రోజులు గడిచే కొద్దీ సంక్రాంతి సినిమాల హీట్ ఇప్పటి నుంచే పెరుగుతూ పోతోంది. ఆల్రెడీ జనవరి 12న మహేష్ బాబు అల్లు అర్జున్ క్లాష్ కావడం మీద ఇండస్ట్రీలో పెద్ద చర్చే జరుగుతోంది. మరోవైపు వెంకీ మామను సైతం పండగ బరిలో నిలిపేందుకు నిర్మాత సురేష్ బాబు తన వర్గాలతో సీరియస్ చర్చలలో మునిగి తేలుతున్నట్టుగా వినికిడి. క్లారిటీ రావడానికి ఇంకొద్ది రోజులు పట్టొచ్చు. మరోవైపు రజనీకాంత్ దర్బార్ అందరి కంటే ముందుగా జనవరి 10న వచ్చేందుకు రెడీ అయినట్టుగా చెన్నై టాక్.

సరే వీళ్లంతా స్టార్లు కాబట్టి ఓపెనింగ్స్ పరంగా గ్యారెంటీ పెట్టుకోవచ్చు . కానీ పోటీలో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఉన్నాడు. సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో రూపొందుతున్న ఎంత మంచివాడవురా జనవరి 15న వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ మేరకు సంక్రాంతి విడుదల అని అందరి కంటే ముందే యూనిట్ ప్రకటనలు కూడా ఇచ్చింది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే కళ్యాణ్ రామ్ ఎంతలేదన్నా రిస్క్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. గతంలో సతీష్ వేగ్నేశ ఇదే  తరహాలో శతమానం భవతితో చిరు బాలయ్య సినిమాలతో పోటీ పడి మరీ గెలిచాడు.

కాని అప్పటి పరిస్థితులకు ఇప్పటికి చాలా తేడా ఉంది. దానికి దిల్ రాజు అనే నిర్మాణ దిగ్గజం అండగా నిలిచింది కాబట్టి మంచి రిలీజ్ సాధ్యమయ్యింది. కాని ఎంత మంచవాడవురాకు అంత సీన్ కనిపించడం లేదు. అందులోనూ పండగకు అందరి కంటే లాస్ట్ లో వస్తే అప్పటికి ధియేటర్ల కొరత ఉండే ఉంటుంది. ఎంత లేదన్నా మహేష్ బన్నీ సినిమాలకు వారం దాటకుండా స్క్రీన్లు ఖాళీ అయ్యే ఛాన్స్ ఉండదు. అలాంటప్పుడు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇప్పటికైతే ఈ మంచివాడు వెనక్కు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇంకా టైం ఉంది కాబట్టి ఏమైనా జరగోచ్చు. లెట్ వెయిట్ అండ్ సి


Tags:    

Similar News