దర్శకుడు ప్రియదర్శన్.. అలనాటి హీరోయిన్ లిజీల కూతురు కళ్యాణి ప్రియదర్శన్.. టాలీవుడ్ మూవీ హలోతో సినీ అరంగేట్రం చేస్తోంది. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్న ఈ భామ.. హలో ఆడియో ఫంక్షన్ లో కొద్దిసేపు అయినా తెలుగులో మాట్లాడి అందరినీ అలరించింది.
"అందరికీ నమస్కారం.. ఇది నా మొదటి సినిమా.. తెలుగులో మాట్లాడ్డం కూడా ఇదే మొదటిసారి. తెలుగు భాష అంటే నాకు చాలా ఇష్టం. కానీ నాకు తెలుగు కొత్త కదా.. పొరపాటున ఏమైనా తప్పుగా మాట్లాడతామోనని భయంగా ఉంది. మీరేమీ అనుకోకపోతే ఇంగ్లీష్ లో మాట్లాడతాను" అంటూ ఇంగ్లీష్ లోకి మారిపోయింది కళ్యాణి.
"అమ్మా.. నాన్నా.. మీ సపోర్ట్ లేకపోతే ఈ ఫిలిం ఇండస్ట్రీలోకి రాగలిగేదాన్ని కాదు. నాగార్జున గారూ.. ఈ సినిమాతో లాంఛింగ్ గురించి నాన్న చెప్పినపుడు చాలా సంతోషించాను. అయితే.. నా లైఫ్ లో ఇదే బెస్ట్ థింగ్.. అలాగే ఇదే వరస్ట్ థింగ్ కూడా. బెస్ట్ థింగ్ ఏంటంటే.. ఇంతకంటే ఎక్కువగా నా గురించి ఎవరూ కేర్ తీసుకోరు.. ఇది నిజం. ఇక వరస్ట్ ఏంటంటే.. మీరు ఏ ప్రొడ్యూసర్ కి అయినా స్టాండర్డ్స్ చాలా హై లెవెల్ లో సెట్ చేసేశారు. ఇతర సినిమాల్లో చేసేటపుడు మళ్లీ నేను ఇంత ఆనందంగా ఉండలేనేమో.. థ్యాంక్యూ" అని చెప్పింది కళ్యాణి.
"విక్రమ్ గారూ.. మీ సినిమాతో లాంఛ్ కావడం చాలా ఆనందంగా ఉంది. ప్రియ లాంటి క్యారెక్టర్ నన్ను నమ్మి ఇచ్చినందుకు థ్యాంక్యూ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. అఖిల్ అమేజింగ్ కో-స్టార్. కెమేరా ముందు మాత్రమే కాదు.. విడిగా కూడా చాలా మంచి వ్యక్తి. మూవీ కోసం చాలా కష్టపడ్డాడు. మీరు తప్పకుండా ఇష్టపడతారు. అనూప్ రూబెన్స్ బెస్ట్ ఆల్బం ఇది. మళ్లీ మీ సినిమాలో చేయాలని అనుకుంటున్నాను" అంటూ తన స్పీచ్ ముగించింది కళ్యాణి.