బాబాయి బలవంతం చేసినా అబ్బాయి నో..!

Update: 2019-02-27 06:11 GMT
'ఎన్టీఆర్‌' బయోపిక్‌ ఫలితం తల క్రిందులు అయ్యింది. సినిమా ప్రారంభ సమయంలో, ట్రైలర్‌ విడుదల సమయంలో వచ్చిన హైప్‌ తీరా సినిమా విడుదల అయ్యే సమయంకు లేక పోవడంతో కలెక్షన్స్‌ దారుణంగా నమోదు అయ్యాయి. కథానాయకుడు విషయంలో కాస్త పర్వాలేదు అనిపించినా, మహానాయకుడు విషయంలో మరింత దారుణమైన వసూళ్లు నమోదు అయ్యాయి. ఇలాంటి సమయంలో 'ఎన్టీఆర్‌' చిత్ర బడ్జెట్‌ మరియు స్టార్స్‌ పారితోషికం వివరాల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఈ చిత్రంలో ఎంతో మంది నటీనటులు కనిపించారు. వారంతా కూడా రెండు మూడు రోజులు షూటింగ్‌ లో పాల్గొన్న వారే. ఎక్కువ శాతం మంది వారం రోజుల లోపు కాల్షీట్లతో వర్క్‌ చేసిన వారే ఉన్నారు. అయితే కళ్యాణ్‌ రామ్‌ మాత్రం ఈ చిత్రం కోసం దాదాపుగా 25 రోజులు షూటింగ్‌ చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది. కళ్యాణ్‌ రామ్‌ ఎక్కువ రోజులు వర్క్‌ చేసిన కారణంగా బాలకృష్ణ పారితోషికం ఆఫర్‌ చేశాడని, అయితే కళ్యాణ్‌ రామ్‌ మాత్రం ససేమేర అన్నట్లుగా తెలుస్తోంది.

తాతగారి మూవీని బాబాయి బాలకృష్ణ తీయడం, అందులో తన తండ్రి హరికృష్ణ పాత్ర పోషించడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిన విషయం. అలాంటి సినిమాకు పారితోషికం ఎలా తీసుకుంటాను అంటూ కళ్యాణ్‌ రామ్‌ అన్నాడట. ఎంతో కొంత అయినా తీసుకోమని బాలకృష్ణ బలవంతం చేసినా కూడా కళ్యాణ్‌ రామ్‌ నో అంటూ సున్నితంగా తిరష్కరించినట్లుగా తెలుస్తోంది. కళ్యాణ్‌ రామ్‌ పారితోషికం లేకుండా నటించిన కారణంగా ఆ కృతజ్ఞతతో తాజాగా '118' చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమంలో బాలయ్య పాల్గొన్నట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News