నందమూరి హీరో మార్కుల కహానీ

Update: 2018-03-22 23:30 GMT
పెద్దగా చదువు రానివారే సినిమా ఇండస్ట్రీ లోకి వస్తారని చాలామంది అనుకుంటారు. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా బాగా చదువుకుని - మంచి జాబ్ కూడా సంపాదించి కేవలం సినిమాపై ఉన్న ప్రేమ వల్ల ఇటు వచ్చేవాళ్ళను ఇప్పుడు చాలామందిని చూస్తున్నాం. అందులో ఒకడు.. మన కళ్యాణ్ రామ్. నందమూరి తారక రామా రావు గారి మనవడు అతనికి సినిమాలలోకి రావడానికి అడ్డేముంది అనుకుంటున్నారా. నిజానికి హీరో అవ్వాలంటే చదువులో గోల్డ్ మెడల్స్ - వంద కి వంద మార్కులు అక్కర్లేదు. కానీ చదువులో చురుకుగా ఉండే కళ్యాణ్ రామ్ కి చిన్నప్పుడు 90 మార్కులు వచ్చినా ఇంట్లో కొట్టేవారట. ఈ విషయాన్ని తానే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

"చదువే జీవనాధారం. కాబట్టి చిన్నప్పటినుండి మా అమ్మ ఎప్పుడు బాగా చదువుకోవాలి అని చెప్తూ ఉండేవారు. 90 శాతం మార్కులు వచ్చినా - ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలి అంటూ దెబ్బలు వేసేవారు. ఇంజనీరింగ్ పూర్తి కాగానే నిర్మాత అవుదాం అనుకున్నా. ఈ విషయం నాన్నకు చెబితే భయపడి నన్ను పై చదువులకు అమెరికా పంపేశారు" అని చెప్పి తర్వాత ఎలా నిర్మాత అయ్యాడో చెప్పాడు. "ఇండియా తిరిగి వచ్చాక సినిమాల్లోకి వచ్చాను. మొదటి రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించాను. ఒక సినిమా హిట్ అవ్వగానే నాన్న ఒక అమ్మాయిని చూపించి పెళ్లి చేసుకోమన్నారు. నేను కొంచెం సమయం కావాలి అని చెప్పినా వినకుండా పెళ్లి చేసేశారు." అంటూ తన పెళ్లి కథను కూడా చెప్పేసాడు నందమూరి హీరో.
Tags:    

Similar News