అప్సరసలతో మైఖెల్ మదన కామరాజు..!

Update: 2022-11-12 05:30 GMT
లోకనాయకుడు.. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కి విక్రం సినిమా ఇచ్చిన ఊపు అంతా ఇంతా కాదు. దాదాపు కమల్ పని అయిపోయింది అనుకున్న ప్రతి ఒక్కరికి దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చారు కమల్ హాసన్. యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో కమల్ చేసిన విక్రం మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేసింది.

కమల్ సొంత బ్యానర్ లో నిర్మించడం వల్ల వచ్చిన లాభాలతో మరుగున పడిన తన సినిమాలను కూడా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇక ఇదేకాకుండా కమల్ హాసన్ మరో బిజినెస్ లోకి అడుగు పెడుతున్నారు. కమల్ హౌజ్ ఆఫ్ ఖద్దర్ అంటూ క్లాతింగ్ బిజినెస్ లోకి వస్తున్నారు.

దీని కోసం ఓ సరికొత్త ఫోటో షూట్ చేశారు కమల్ హాసన్. చుట్టూ అప్సరసల్లాంటి అమ్మయిలు మధ్యలో కమల్ హాస్న్ ఈ పోస్టర్స్ చూస్తుంటే అప్సరసల మధ్య మైఖెల్ మదన కామరాజుని చూసినట్టే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కమల్ చేసిన ఈ ఫోటో షూట్ విరల్ గా మారింది. కమల్ ఏం చేసినా దానిలో స్పెషాలిటీ ఉండాల్సిందే. అందుకే పడుచు భామలతో కమల్ కత్తిలాంటి స్టిల్స్ ఇచ్చారు. తన బ్రాండ్ ని ప్రమోట్ చేసుకోవడం కోసం తానే ఒక మోడల్ గా మారారు కమల్ హాసన్.

రాజకీయాల్లో పెను మార్పు తీసుకొద్దామని పార్టీ స్థాపించిన కమల్ ఓ పక్క ఆ కార్యక్రమాలు చేస్తూనే మరోపక్క సినిమాలు చేస్తున్నారు. ఇవే కాకుండా కొత్తగా ఈ ఖద్దర్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇలా తనని తాను బిజీ చేసుకుంటూ ఉంటున్నారు కమల్ హాసన్. విక్రం తర్వాత కొన్నాళ్లుగా సెట్స్ మీదకు వెళ్లని.. దాదాపు క్యాన్సిల్ అవుతుంది అనుకున్న ఇండియన్ 2 తిరిగి షూటింగ్ ప్రారంభించారు. ఇదేకాకుండా కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న శభాష్ నాయుడు సినిమాని కూడా మళ్లీ తీసుకున్నారట కమల్.

రీసెంట్ గా తన బర్త్ డే సందర్భంగా మణిరత్నం కాంబో మూవీని ఎనౌన్స్ చేశారు కమల్ హాసన్. నాయకుడు కాంబో కోసం కొనేళ్లుగా ఎదురుచూస్తున్న సినీ ప్రియులకు ఈ ఎనౌన్స్ మెంట్ సూపర్ కిక్ ఇచ్చింది. పి.ఎస్ 1 రిలీజ్ అవగా పి.ఎస్ 2 నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

అది పూర్తయ్యాక కమల్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు మణిరత్నం. కమల్ సినిమాల లిస్ట్ చూస్తుంటే మళ్లీ ఆయన బాక్సాఫీస్ పై తన ప్రభావం చూపించబోతున్నారని అర్థమవుతుంది. సినిమాలే కాదు కొత్తగా బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టిన కమల్ అందులో కూడా రాణించాలని అనుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News