హాలీవుడ్ మరియు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి మధ్య సంబంధాలు ఈ మధ్య చాలా ఎక్కువవుతున్నాయి. మన తారలు అక్కడ మంచి ప్రతిభ కనబరుస్తుండడంతో కొంత మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ స్పెషల్ గా ఇండియన్ స్టార్స్ ని వారి సినిమాల్లో వాడేస్తున్నారు. అంతే కాకుండా మన సినిమాలను కూడా వారు రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు. ఇకపోతే అప్పుడపుడు సినిమాలకు సంబందించిన ఏదైనా వేడుకలు జరిగితే ఆహ్వానాలు అందగానే ఇండియాలో వాలిపోతున్నారు.
అసలు మ్యాటర్ లోకి వస్తే.. ద డార్క్ నైట్ - ఇంటర్ స్టెల్లార్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ క్రిస్టోఫర్ నొలాన్.. మరియు యునివర్సల్ హీరో.. దిగ్గజ నటుడు దర్శకుడు కమల్ హాసన్ ని కలిశారు. ముంబై లో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా క్రిస్టోఫర్ ఇండియన్ స్టార్ నటులను - దర్శకులను కలిశారు. ముఖ్యంగా కమల్ హాసన్ ని ఆయన స్పెషల్ గా మీట్ అవ్వడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. సినిమాలకు సంబందించిన విషయాల గురించి ఇద్దరు చాలా సేపు చర్చించుకున్నారు.
ఇకపోతే ఆయనతో మాట్లాడుతున్న ఒక ఫొటోని కమల్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఒక విషయాన్ని తెలిపారు. "మిస్టర్.క్రిస్టోఫర్ నోలన్ ను కలిశాను. డిజిటల్ ఫార్మాట్ లో డన్ కిర్క్ చూసినందుకు క్షమాపణ చెబుతున్నా.. అందుకు బదులుగా అతను హే రామ్ ను డిజిటల్ ఫార్మాట్ లో చూడడానికి పంపాను. అతను నా పాపనాశనం సినిమా చూశాడని తెలుసుకుని ఆశ్చర్యపోయాను'' అంటూ కమల్ ట్వీట్ చేశాడు.