ఆస్కార్ కి మన సినిమాలేవీ వెళ్లవు.. ఆ స్థాయి సినిమాలు మనం తీయలేమా? అని కమల్ ని ప్రశ్నిస్తే ఏమన్నారో తెలుసా? అది మనమే చేసుకోవాలి. అలాంటి సినిమాలు మనమే తీయాలి. వాళ్లే మన దగ్గరికి రావాలి. ఇప్పుడు ప్రపంచం గర్వించదగ్గ సినిమాలెన్నో చేస్తున్నాం. వేలాది సినిమాలు తీస్తున్నాం. హాలీవుడ్ మనం చేసినన్ని సినిమాలు చేయలేదు. అమెరికాలో మనలాగా సినిమాలు చూడరు. అయితే మనం మంచి సినిమాలు తీయాలి. ప్రపంచ స్థాయిని అందుకోవాలి. మనమే వరల్డ్ స్టాండార్డ్ ని ఎందుకు అందుకోకూడదు? అంటూ ప్రశ్నించారు.
ఆ స్టాండార్డ్ మనకి ఉందని అనుకుంటున్నారా? అన్న ప్రశ్నకు...ఇప్పటికైతే లేదు. మునుముందు వస్తుంది... అన్న ఆశాభావాన్ని కనబరిచారు. హీరోగా - టెక్నీషియన్ గా దేశంలో టాప్ 10లో మీ పేరు ఉంటుంది. మీరు అందుకు తగ్గట్టు భారీ సినిమా తీసేందుకు ప్రయత్నించరా? బాహుబలిని మించిన సినిమా చేయరా? అన్న ప్రశ్నకు... ప్రతిసారీ బాహుబలి తీయకూడదు. క్వాలిటీ సినిమాలు తీయాలి. బాహుబలి తెచ్చిన గౌరవాన్ని మనం మరింతగా పెంచేలా సినిమాలు చేయాలి. అందుకోసం ప్రయత్నిస్తాను. అని అన్నారు.
చీకటి రాజ్యం సినిమాను ప్రమోట్ చేస్తూ నేడు హైదరాబాద్ లో విలేఖరులతో మాట్లాడిన కమల్.. ఈ కామెంట్లు చేశారు.