లోక నాయకుడు.. విశ్వనటుడు లాంటి ఎన్నో బిరుదులతో పిలిపించుకున్న కమల్ హాసన్ కు.. వివాదాలను పిలవడం కూడా కొత్తేమీ కాదు. తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసి.. చిన్నపాటి కాంట్రవర్సీలను బాగానే రగిలిస్తుంటారు. అందరూ పొగిడిన బాహుబలిని సాధారణమే అనడం.. కెమేరాలు ఎక్కడుంటే రజినీకాంత్ అక్కడుంటారని అనడం లాంటివి రీసెంట్ గా జరిగిన సంఘటనలే.
ఇప్పుడు ఇంతకు మించిన ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ముందు జరిగిన రెండు దక్షిణాది హీరో.. దక్షిణాదివారిపై చేసిన కామెంట్స్ కావడంతో అంతగా రచ్చ జరగలేదు. కానీ ఇప్పుడు ఆమీర్ ఖాన్ కు కమల్ కౌంటర్ వేయడం.. దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయిపోయింది. నేషనల్ మీడియా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. బిగ్ బాస్ తమిళ్ వెర్షన్ ను కమల్ హాసన్ హోస్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ట్రైలర్ లాంఛింగ్ ఈవెంట్ లో.. 'సత్యమేవ జయతే' లాంటి సామాజిక కార్యక్రమం కాకుండా.. 'బిగ్ బాస్' లాంటి వివాదాస్పద కార్యక్రమం ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్న ఎదురైంది.
దీనికి 'సత్యమేవ జయతే లాంటి కార్యక్రమం చేసి నా సామాజిక బాధ్యతను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆ కార్యక్రమాన్ని హోస్ట్ చేసిన వ్యక్తి కంటే ఎక్కువగానే నాకు సామాజిక బాధ్యత ఉంది' అంటూ ఆమిర్ ఖాన్ కు కమల్ కౌంటర్ వేయడం ఇప్పుడు సీరియస్ ఇష్యూ అయిపోతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/