గొప్పలు చెప్పుకోవటం తప్పు కాదు. కానీ.. ఆ గొప్పల కారణంగా ఎవరినైనా హర్ట్ చేస్తున్నామా? అన్నది క్వశ్చన్. అవేమీ పట్టించుకోకుండా.. తమలాంటి విశాల భావాలున్న వారు ఇంకెవరూ ఉండనట్లుగా ప్రముఖులు కొందరు చేసే వ్యాఖ్యలు వారికి కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు సినీ ప్రముఖులు.. ఇటీవల రాజకీయ పార్టీని స్టార్ట్ చేసిన కమల్ హాసన్.
తనకు కులం.. మతం లాంటివి ఉండవని.. వాటికి అతీతంగా తాను తన పిల్లల్ని పెంచినట్లుగా పేర్కొన్నారు. తన ఇద్దరు కూతుళ్ల స్కూల్ ఆడ్మిషన్ల అప్లికేషన్లో కులం.. మతం తెలియజేయాలంటూ ఉన్న కాలమ్‌ను పూర్తి చేయకుండా వదిలేసినట్లు పేర్కొన్నారు.
రాబోయే తరానికి కులం.. మతం గురించి తెలీకుండా చేయాలంటే ఇంతకు మించిన మార్గం మరొకటి ఉండదని గొప్పలు చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ.. తన కుమార్తె శ్రుతి హసన్ తన కులం గురించి చెప్పిన వీడియో క్లిప్ ఒకటి ఉందన్న విషయం కమల్ కు తెలీదేమో కానీ.. ఆయన గొప్పలు చెప్పారు.
ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో ఇలాంటి గొప్పలకు వెనువెంటనే షాకులు ఇచ్చేందుకు అవకాశాలు ఉండటంతో.. కమల్ మాటలకు కౌంటర్ అన్న చందంగా ఆ మధ్యన కమల్ కుమార్తె శ్రుతి హసన్ మాట్లాడుతూ తాను అయ్యంగార్ అని పేర్కొన్న వీడియో క్లిప్ ను బయటకు తీశారు. కమల్ కు ట్వీట్ పోస్టు చేస్తూ.. ఈ వీడియోను జత చేశారు.
పిల్లలకు వారి కులం గురించి తెలీకుందా పెంచాలన్న మాటకు కౌంటర్ గా జంధ్యం తీసి.. కుల ధ్రువీకరణ పత్రాన్ని చించినంతనే కులం పోదన్న చురక ఒకటి వేశారు. అంతేనా..కమల్ చెప్పే సంస్కరణలన్నీ మొదట ఆయన తన ఇంటి నుంచే ప్రారంభించాలంటూ హితవు పలికారు. గొప్పలు చెప్పుకోవటం ఎందుకు? ఇలా.. అడ్డంగా బుక్ కావటం ఎందుకు..?
Full View