పాత చింతకాయ ఆలోచనతోనే నష్టం

Update: 2015-04-12 06:20 GMT
పాత చింతకాయ ఆలోచనలతో నా సినిమాకి తీరని నష్టాన్ని కలిగిస్తున్నారంటూ విశ్వనటుడు కమల్‌ హాసన్‌ సెన్సార్‌ బృందంపై విరుచుకుపడ్డారు. సెన్సార్‌ బోర్డ్‌లో ప్రభుత్వోద్యోగుల్ని నియమించుకుంది సినిమాకి వ్యతిరేకంగా వెళ్లమని కాదని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఉత్తమ విలన్‌ చిత్రంలో మతపరమైన వివాదం దాగి ఉందన్న నెపంతో సినిమాకి డ్యామేజ్‌ చేయడం అన్యాయమని అన్నారు.

పురాణేతిహాసలే ఆధారంగా తన సినిమాకి నష్టం కలిగించడం అన్యాయమని, వెయ్యేళ్ల క్రితం నాటి విషయాల్ని నేటితో ముడిపెట్టడం భావ్యం కాదని అన్నారు. ఇప్పటికే విశ్వ హిందూ పరిషత్‌ కమల్‌హాసన్‌ 'ఉత్తమ విలన్‌'పై కత్తిగట్టింది. ఈ చిత్రంలో హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా సన్నివేశాలున్నాయంటూ కమల్‌హాసన్‌కి అల్టిమేటమ్‌ జారీ చేశారు. దీనికి ముస్లిమ్‌ సోదరుల నుంచి కూడా విహెచ్‌పికి మద్ధతు లభించింది. అయితే అందరినీ సవాల్‌ చేస్తూ కమల్‌హాసన్‌ పైవిధంగా సీరియస్‌ అయ్యారు. వేల సంవత్సరాల నాటి ఇష్యూస్‌ని ప్రస్తుత సమాజానికి అన్వయించడం తగదని హితవు పలికారు. ప్రతి 50 సంవత్సరాలకు ఓసారి ఇలాంటివాటిని సవరించాల్సిందేనని అంటున్నారు.

అప్పట్లో విశ్వరూపం విషయంలోనూ ముస్లిముల మనోభావాలను దెబ్బ తీశాడని కమల్‌పై ముస్లిములు విరుచుకుపడ్డారు. ఇప్పుడు హిందువల నుంచే అతడికి సవాల్‌ ఎదురైంది. కుల, మతాలకు అతీతంగా సినిమాలు తీయడం కమల్‌హాసన్‌కి చేతకాలేదు. తను ఏం అనుకుంటే అదే తీస్తాడు. అయితే ఈ సినిమాని తెలుగులో రిలీజ్‌ చేస్తున్న సి.కళ్యాణ్‌ స్పందిస్తూ.. వివాదాలు మామూలే. వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదు. మే 1న సినిమా రిలీజ్‌ చేస్తున్నామని హామీ ఇచ్చారు.
Tags:    

Similar News