కూతురి పేరును మరచిపోయే తండ్రి ఉంటారా చెప్పండీ! ఏ పనిలో ఉన్నా ఎన్ని టెన్షన్లలో ఉన్నా కుమార్తె పేరును ఎవరైనా ఎలా మరచిపోతారు..? కానీ, తన పేరును తండ్రి కమల్ హాసన్ మరచిపోయాడూ అని చెబుతోంది శృతీ హాసన్. ఆ ఫన్నీ సందర్భాన్ని తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను అని చెబుతోంది. ‘నా పేరును మా నాన్న మరచిపోయానని చెబితే ఎవ్వరూ నమ్మరు. కానీ అలాంటి సంఘటన ఒకటి జరిగింది కాబట్టే చెబుతున్నాను’ అంటోంది శృతీ. కమల్ హాసన్ ప్రస్తుతం శభాష్ నాయుడు అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో శృతీ హాసన్ కుమార్తెగా నటిస్తోంది. అంటే రియల్ లైఫ్ పాత్రలు అన్నమాట. ఈ సినిమాకు కమల్ హాసన్ రెండో కుమార్తె అక్షరా హాసన్ సహాయ దర్శకురాలిగా పనిచేస్తోంది. ఇంతకీ ఈ సినిమాకి డైరెక్షన్ ఎవరనుకున్నారూ... కమల్ హాసన్!
ఈ చిత్రంలో శృతీ హాసన్ పాత్రకు వేరే పేరు ఉంది. ఒక సన్నివేశంలో ఆ పాత్రను కమల్ పేరు పెట్టి పిలవాల్సిన సందర్భం ఉంటుంది. ఆ సీన్ షూటింగ్ జరుగుతుండగా... డైలాగుల మధ్యలో పాత్ర పేరు మరచిపోయి, అసలు పేరుతో శృతీ అని పిలిశాచేరాట! షాట్ పూర్తయిన తరువాత ఆ విషయాన్ని తండ్రికి చెప్పింది శృతీ. ‘నా పేరును ఎందుకు మరచిపోయావు నాన్నా..? కన్నబిడ్డ పేరును కూడా మరచిపోతే ఎలా’ అని కమల్ ను కాసేపు ఆటపట్టించింది. అయితే, తన స్క్రీన్ నేమ్ తప్పుగా చెప్పిన విషయాన్ని ఆయనకి చెబుతూనే... యాక్టింగ్ చేస్తున్నప్పుడు కూడా తనని రియల్ నేమ్ తో పిలిచినందుకు కమల్ కి థ్యాంక్స్ చెప్పాని శృతీ అంటోంది. శృతీ పేరును కమల్ మరచిపోవడం అనేది అలా జరిగిందన్నమాట! రీల్ లైఫ్ తండ్రిపాత్రలో మరచిపోయారు. కానీ, రియల్ లైఫ్ లో ఎవరైనా ఎలా మరచిపోగలరు చెప్పండీ..! తండ్రితో నటిస్తుండగా చోటు చేసుకున్న ఈ సంఘటనను ఎప్పటికీ మరచిపోలేనని శృతీ అంటోంది.