కమల్ హాసన్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చితరం విక్రమ్. కమల్ హాసన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం థ్రిల్స్ హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు గన్ ఫైరింగ్ రక్తి కట్టిస్తోంది. కమల్ తో పాటు సేతుపతి - ఫహద్ ఫాజిల్ వంటి టాప్ హీరోలు ఇందులో కీలక పాత్రలు పోషించడంతో ఒకరితో ఒకరు పోటీపడి నటించారని అర్థమవుతోంది. కేవలం కమల్ పాత్ర మాత్రమే కాకుండా ఇతర పాత్రలకు నటన పరంగా బోలెడంత స్కోప్ కనిపిస్తోంది.
విక్రమ్ రెండు నిమిషాల ముప్పై సెకన్ల ట్రైలర్ ఆద్యంతం కమల్ బారిటోన్ వాయిస్ ఓవర్ తో ఒక రాత్రిలో కథ మొత్తం నడుస్తుంటుంది. కమల్ వర్సెస్ విజయ్ సేతుపతి .. ఫహద్ ఫాసిల్ ట్రీట్ గా మారుతుంది. తుపాకుల హోరు..కొడవళ్ల వేటతో నాన్ స్టాప్ యాక్షన్ దాంతో పాటే మార్మికత ట్రైలర్ ఆద్యంతం గగుర్పొడిచేలా చేస్తుంది.
అనిరుధ్ అందించిన ''ఈగిల్ ఈజ్ కమింగ్'' బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్ రేంజును పెంచింది. గిరీష్ గంగాధర్ సినిమాటోగ్రఫీ.. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ ప్రత్యేక ఆకర్షణలు. ''ముసుగు వేసుకున్న మనిషి మాత్రమే ముసుగు మనిషి ముఖాన్ని విప్పగలడు''.. ''ఒకరి విప్లవం మరొకరి ఉగ్రవాదం'' వంటి పవర్ ఫుల్ పంచ్ లైన్ లతో లోకేష్ కనగరాజ్ సంభాషణల పరంగా ప్రత్యేకతను ఆపాదించాడు. అన్నింటికీ మించి కమల్ ఓ డైలాగ్ లో ''నా అడవిలో ఎవరినైనా నిర్ణయించేది నేనే. రాత్రిలోనూ జీవించండి .. ప్రకృతి మాత్రమే కాదు'' అన్న డైలాగ్ ఆకర్షిస్తుంది.
విక్రమ్ ట్రైలర్ లో కీలకమైనది మార్మికత. ఏదో జరుగుతోంది అన్న సస్పెన్స్ ని డ్రాగ్ చేయగలిగారు. అదేమిటన్నది క్లారిటీగా కన్ఫ్యూజన్ లేకుండా కనెక్టయితే హిట్టు సాధ్యమే.
కమల్- సేతుపతి- ఫహద్ ల స్క్రీన్ ప్రెజెన్స్ ని ఆస్వాదించడానికి చాలా స్కోప్ ఉంది. లూప్ మోడ్ లోని బిజిఎమ్ సినిమాపై అంచనాలను పెంచింది. లోకేష్ కనగరాజ్ తన గురువైన కమల్ పై ప్రేమ-కృతజ్ఞత చూపుతూ తన నివాళులర్పించారని భావించాలి.
ఈ చిత్రంలో సూర్య అతిధి పాత్రలో నటిస్తారన్న సమాచారం ఉంది. కమల్- విజయ్ సేతుపతి- ఫహద్ ఫాసిల్- ఎస్. గాయత్రి- వి.జె. మహేశ్వరి- మైనా నందిని- శివాని నారాయణన్- నరైన్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ సమర్పణలో రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ - టర్మరిక్ మీడియా నిర్మిస్తున్నాయి. జూన్ 3న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Full View