వంగవీటి టీజర్లు నెట నుంచి ఔట్!!

Update: 2016-12-02 11:20 GMT
రామ్ గోపాల్ వర్మ తీసిన లేటెస్ట్ తెలుగు మూవీ వంగవీటికి కష్టాలు కంటిన్యూస్ అన్నట్లుగా ఉంది పరిస్థితి. సరిగ్గా ఆడియో ఫంక్షన్ కు ముందు రోజు.. కమ్మ కాపు అంటూ కులాలపై ఉన్న పాటను తీసేస్తున్నట్లు వర్మ స్వయంగా ప్రకటించాడు. ఇది జరిగి కొన్ని గంటలు గడవక ముందే వంగవీటికి మరో కష్టం వచ్చి పడింది.

వంగవీటి మూవీపై వంగవీటి రాధాకృష్ణ హైకోర్టులో వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. వాస్తవాలకు భిన్నంగా తన కుటుంబాన్ని ఉద్దేశించి వంగవీటి మూవీ తెరకెక్కిస్తున్నారన్నది ఈయన ఆరోపణ. అలాగే సెన్సార్‌ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే.. సినిమాకి సంబంధించిన టీజర్లు - ట్రైలర్లు ఇంటర్నెట్ లో విడుదల చేశారని.. ఇవి టీవీ ఛానల్స్ లోను.. వెబ్ సైట్లలోను ప్రసారం అవుతున్నాయని ఈయన వాదన. దీనిపై కోర్టు నిలదీయడంతో టీజర్లను తొలగించేస్తామంటూ వంగవీటి నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌ హైకోర్టుకు తెలిపారు.

స్వయంగా నిర్మాత నుంచి హామీ రావడంతో.. వంగవీటిపై నమోదైన పిటిషన్ పై హైకోర్టు విచారణ ఇప్పటికి ముగిసింది. ఒకే రోజు వర్మ సినిమాకు రెండు పంచ్ లు పడ్డం.. రెండింటిలోను వర్మ అండ్ టీం వెనక్కి తగ్గాల్సి రావడంతో.. రిలీజ్ అయ్యేనాటికి మరెన్ని మార్పులొస్తాయో అనుంకుంటున్న వర్మ అభిమానులు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News