బాలీవుడ్ లో కుట్రల గురించి.. పరిశ్రమ ఇన్ సైడర్స్ ఔట్ సైడర్స్ పైనా ఎన్నడూ లేనంతగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా పరిశ్రమ వెలుపలి ప్రతిభను ఆ నాలుగు కుటుంబాల ప్రముఖులు తొక్కేస్తున్నారంటూ కంగన తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ మరణం వెనక కుట్రల్ని కంగన బయటపెడుతోంది.
ఇండస్ట్రీని చోప్రాలు.. ఖాన్ లు.. జోహార్లు శాసిస్తున్నారని తాజా ఇంటర్వ్యూలో నివేదించిన కంగన వారి కుట్రల్ని బహిర్గతం చేసింది. బాలీవుడ్ లో ఆ నలుగురి బంధుప్రీతి కుట్రల్ని పోలీసులు ప్రశ్నించాలని కూడా కంగన సూచించింది. బంధుప్రీతితో వేధింపులకు గురి చేస్తున్నారని పీక్కు తినే రాబందులు వీరంతా అంటూ ఆరోపించింది. సదరు రాబంధుల్ని ముంబై పోలీసులు ప్రశ్నించాలని మార్పు కోసం వారిని శిక్షించాలని కూడా కంగన కోరింది.
అంతే కాదు.. సుశాంత్ సింగ్ ని ఆ నలుగురు ఎలా వేధించారో కూడా కంగన పూసగుచ్చినట్టు చెప్పడం సంచలనంగా మారింది. కొన్ని వరుస బ్లాక్ బస్టర్లలో నటించిన సుశాంత్ ని ఫ్లాప్ హీరో అంటూ కరణ్ వ్యాఖ్యానించారని .. అతడు రేపిస్ట్ అంటూ జర్నలిస్ట్ రాజీవ్ మసంద్ షాడో ఆర్టికల్స్ రాశారని.. డ్రగ్గిస్ట్ అంటూ మహేష్ భట్ లాంటి ప్రముఖుడు కించపరిచారని కూడా కంగన ఆరోపించింది. వీళ్లంతా బాలీవుడ్ లో సూసైడ్ మాఫియాగా తయారై వేధింపులకు పాల్పడుతున్నారని ఫైరైంది. వీళ్లను ఉరి తీయకపోయినా కనీసం విచారించాలని ముంబై పోలీసుల్ని కోరింది. సూశాంత్ సూసైడ్ కి కారకులైన భన్సాలీ- కరణ్ - రాజీవ్ మసంద్- మహేష్ భట్ లను ఎందుకని పోలీసుల పట్టించుకోవడం లేదు? అంటూ నిలదీసింది.
సుల్తాన్ చిత్రంలో నటించకపోతే భాయ్ ని వ్యతిరేకిస్తే ఇక కెరీర్ ఖతమ్ అయినట్టేనని ఆదిత్య చోప్రా తనను బెదిరించారని కూడా కంగన ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది. సల్మాన్ భాయ్ మాటల్ని వ్యతిరేకించ వద్దని కూడా ఆయన అన్నారట. ఇలా తనను బెదిరించే హక్కు చోప్రాకి ఉందా? అని కూడా నిలదీసింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ లో కరణ్ `బాలీవుడ్ నుంచి కంగనను తరిమివేయాలని వ్యాఖ్యానించి తీవ్రంగా అవమానించారని .. తెలిపింది. ఆ సమయంలో తనకు అండగా నిలిచిన సుశాంత్ పై కుట్రలు చేశారని కూడా ఆరోపించింది.
సుశాంత్ సింగ్ రేపిస్ట్.. డ్రగ్గిస్ట్.. డైరెక్టర్లను కొడుతాడు! అంటూ రాజీవ్ మసంద్ పేరు లేని కథనాల్ని రాయడంపైనా నిప్పులు చెరిగింది కంగన. భట్- జోహర్- చోప్రా ఫ్యామిలీలు ఎదురేలేనంత బలంగా ఉన్నాయి. వీళ్లను పోలీసులు విచారించాలని కోరింది. తనను వేధించినట్టే సుశాంత్ ని వేధించారని ఇంకా ఎందరినో వేధిస్తారని కూడా నివేదించింది.