సీనియర్ స్టంట్ మాస్టర్ చేతికి మెగాఫోన్

Update: 2016-04-21 13:30 GMT
రచయిత రచయితగానే ఉండాలి.. లిరిసిస్ట్ పాటలే రాయలి.. కొరియోగ్రాఫర్ డ్యాన్సులే కంపోజ్ చేయాలి.. అనే కట్టుబాట్లేమీ లేవిప్పుడు. ఇప్పటి టెక్నీషియన్లు తమ విభాగానికే పరిమితం అయిపోవట్లేదు. 24 క్రాఫ్ట్స్ లో అత్యున్నతమైందిగా భావించే డైరెక్షన్ విభాగంలో తమదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనిపించుకోవాలని ఆరాటపడుతున్నారు. రచయితలు.. కెమెరామన్లు.. కొరియోగ్రాఫర్లు.. మ్యూజిక్ డైరెక్టర్లు.. ఎడిటర్లు.. స్టంట్ మాస్టర్లు.. ఇలా అన్ని విభాగాల వాళ్లూ మెగా ఫోన్ పట్టేస్తున్న కాలమిది. ఈ కోవలోనే సీనియర్ స్టంట్ మాస్టర్ కణల్ కణ్ణన్ కూడా డైరెక్టర్ అయిపోతున్నట్లు సమాచారం.

సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ స్టంట్ మాస్టర్లలో ఒకడైన కణల్.. త్వరలోనే మెగా ఫోన్ పడుతున్నాడు. అతను మన తెలుగు హీరో గోపీచంద్ తో సినిమా చేయబోతుండటం విశేషం. ఈ మధ్యే కణల్ గోపీకి ఓ కథ చెప్పి మెప్పించినట్లు తెలిసింది. ఓ ప్రముఖ నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. కణల్ తన బ్యాగ్రౌండ్ కు తగ్గట్లే మంచి యాక్షన్ కథతో గోపీని కలిసినట్లు తెలిసింది. గోపీ ఇంతకుముందు కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ తో ‘రణం’ సినిమా చేసి మంచి ఫలితాన్నందుకున్నాడు. ఇప్పుడతను స్టంట్ మాస్టర్ ను డైరెక్టర్ గా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఎ.ఎం.రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో ‘ఆక్సిజన్’ అనే సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత కణల్ తో సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి.
Tags:    

Similar News