150 కోట్లు.. 100.. 20.. సింక్‌ లేదే!!

Update: 2015-10-26 04:55 GMT
బాహుబ‌లి-1 పెట్టుబ‌డి ఎంత‌? దాదాపు 150 కోట్లు.. విజయ్‌ పులి పెట్టుబ‌డి ఎంత‌? 100 కోట్లు.. మ‌రి కంచె పెట్టుబడి ఎంత‌? .. 20 కోట్లు. ఈ మూడు సినిమాల‌కు ఉన్న ఒకే ఒక్క సారూప్య‌త వార్ ఎపిసోడ్స్‌. విజువ‌ల్ గ్రాఫిక్స్‌ తో ముడిప‌డిన అత్యంత ఠ‌ఫ్ టాస్క్ ఇది. అస‌లు గ్రాఫిక్స్ కోస‌మే బోలెడంత ఖ‌ర్చ‌యిపోతుంది. కానీ క్రిష్ ఎలా మ్యానేజ్ చేశాడో తెలీదు కానీ అత‌డు మాత్రం కంచె చిత్రాన్ని కేవ‌లం 20 కోట్ల ఖ‌ర్చుతో పూర్తి చేయ‌గ‌లిగాన‌ని అంటున్నాడు.

అస‌లు ఆ సినిమాకి ఉప‌యోగించిన గ్రాఫిక్స్ ఖ‌ర్చు అసాధార‌ణ‌మైన‌ది. పైగా జార్జియా వెళ్లి అక్క‌డ ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి పొంది, అక్క‌డ లోక‌ల్ కాస్టింగ్‌తో వార్ ఎపిసోడ్స్ తెర‌కెక్కించాడు. ఇదంతా అసాధార‌ణ‌మైన ప్రాసెస్‌. అయినా అంత త‌క్కువ బ‌డ్జెట్‌ లో సినిమా పూర్తి చేయ‌గలిగాడంటే అది నిజమైన ఛాలెంజ్ కిందే లెక్క‌. ముఖ్యంగా ఈ సినిమాలో ఫోటోగ్ర‌ఫీ అసాధార‌ణం. నిపుణుడైన జ్ఞాన‌శేఖ‌ర్ పనిత‌నాన్ని ఎవ‌రూ అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. కంచె థియేట‌ర్ల‌లో డీసెంట్ క‌లెక్ష‌న్లు సాధిస్తోంది. వంద‌ల కోట్లు పెట్టుబ‌డి పెట్టించ‌కుండా తెలివిగా, ప్ర‌ణాళికా యుతంగా తెర‌కెక్కిస్తే ఇలాంటి అసాధార‌ణ ఫీట్స్ సాధ్య‌మేన‌ని క్రిష్ నిరూపించాడు. మేకింగ్‌కి మాష్ట‌ర్ ప్లాన్ చాలా ముఖ్యం అని ప్రూవ్ చేశాడు. ఇది అంద‌రికీ ఆద‌ర్శం.
Tags:    

Similar News