ప్రతీ ఏడాది.. బాలీవుడ్‌లో అవార్డ్సు కోసం ఓ ఇద్దరు నాయికలు కొట్టుకుంటూనే ఉంటారు. అయితే ఈసారి మాత్రం పోటీ బాగా రసవత్తరంగా మారింది. హీరోయిన్ సెంట్రిక్‌గా రూపొందిన రెండు సినిమాలు బాలీవుడ్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించడమే కాదు.. ఇప్పుడు అవార్డులు ఇచ్చే జడ్జీలకు కూడా పిచ్చెక్కిస్తున్నాయి.
ఫిలింఫేర్ అవార్డ్స్ తాజా నామినేషన్స్‌ను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. బెస్ట్ యాక్ట్రెస్ క్యాటగిరీ చాలా ఇంట్రస్టెంగ్‌గా ఉంది. గత ఏడాది వచ్చిన సినిమాలన్నింటిలోకి.. నాయికలు ప్రదర్శనను చూస్తే.. మనకు వెంటనే గుర్తొచ్చేది ఇద్దరే. ఒకరు కంగనా రనౌత్, ఇంకొకరు ప్రియాంక చోప్రా. మేరీ కోమ్ జీవితచరిత్ర ఆధారంగా రూపొందిన సినిమా ''మేరీ కోమ్''. ఈ సినిమా కోసం ప్రియాంక చాలా కష్టపడింది. సినిమాలో కూడా పరిణితి చెందిన నటనతో ఇరగదీసింది. క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది.
ఇక కంగనారనౌత్ 'క్వీన్' సినిమాతో రచ్చ చేసిందంతే. ఓ అమాయక ఢిల్లీ ఆడపిల్లగా ప్యారిస్ వీధుల్లో ఈమె చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఆద్యంతం సినిమాను తన భుజాలపై నడిపిస్తూ అబ్బురపరిచింది. ఈ ఇద్దరిలో మరి అవార్డు ఎవర్ని వరిస్తుంది అనేది ఇప్పుడు ఉత్కంఠ. అంతేకాదు.. ఇదే నటీమణులు నేషనల్ అవార్డులకు కూడా నామినేట్ అయ్యే ఛాన్సుంది. అప్పుడు కూడా వార్ చాలా ఆసక్తికరంగానే ఉంటుంది.